Amazon Prime: అమెజాన్‌ నుంచి కొత్త ప్లాన్‌.. ఇక ప్రైమ్‌ వీడియోలు చాలా చౌక..!

Amazon Prime: నేటి రోజులలో ఓటీటీ ప్లాట్‌ఫాంల హవా కొనసాగుతోంది. వినియోగదారులని ఆకట్టుకునేందుకు పలు ఓటీటీ కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లని ప్రవేశపెడుతున్నాయి.

Update: 2023-06-19 14:30 GMT

Amazon Prime: అమెజాన్‌ నుంచి కొత్త ప్లాన్‌.. ఇక ప్రైమ్‌ వీడియోలు చాలా చౌక..!

Amazon Prime: నేటి రోజులలో ఓటీటీ ప్లాట్‌ఫాంల హవా కొనసాగుతోంది. వినియోగదారులని ఆకట్టుకునేందుకు పలు ఓటీటీ కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లని ప్రవేశపెడుతున్నాయి. అందులో అమెజాన్‌ ప్రైమ్‌ అందరికంటే ముందువరుసలో ఉంటుంది. అయితే అందరు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఖర్చు ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ కంపెనీ ఇప్పుడు చౌకైన ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. దీనిపేరు అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్. ఈ ప్లాన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ Prime Lite మెంబర్‌షిప్ ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది కానీ ప్రస్తుతం వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ కోసం కంపెనీ నెలవారీ లేదా 3-నెలల ప్లాన్‌ను ప్రారంభించలేదు. వార్షిక ప్లాన్‌తో ప్రైమ్ లైట్ సభ్యత్వాన్ని పొందవచ్చు. ప్రజల సమాచారం కోసం కంపెనీ ఈ సభ్యత్వం ప్రామాణిక ప్రైమ్ మెంబర్‌షిప్ కంటే రూ.500 చౌకగా ఉంటుంది. అంటే వార్షిక ప్లాన్ ధర రూ.999గా నిర్ణయించారు. మరోవైపు ప్రైమ్ మెంబర్‌షిప్ వార్షిక ప్లాన్ ధర రూ.1499గా ఉంది.

Amazon Prime Lite ప్రయోజనాలు

ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్‌తో వినియోగదారులు రెండు రోజుల ఉచిత డెలివరీ, స్టాండర్డ్ డెలివరీ సౌకర్యాన్ని పొందుతారు. Amazon Pay, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉంటే కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది మాత్రమే కాదు Amazon నుంచి ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకమైన మెరుపు డీల్స్, లైట్నింగ్ డీల్స్, డీల్ ఆఫ్ ది డేకి కూడా యాక్సెస్ పొందుతారు. ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్‌తో అపరిమిత యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాన్‌తో ఇష్టమైన టీవీ షోలు, సినిమాలు మొదలైన వాటిని HD నాణ్యతలో చూడగలుగుతారు.

Tags:    

Similar News