Redmi నుంచి రూ.12000 కంటే తక్కువ ధరలో 5G ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Redmi 12 5g: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రెడ్‌ మి రూ.12000 కంటే తక్కువ ధరలో 5G ఫోన్‌ విడుదల చేసింది.

Update: 2023-08-05 05:43 GMT

Redmi నుంచి రూ.12000 కంటే తక్కువ ధరలో 5G ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Redmi 12 5g: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రెడ్‌ మి రూ.12000 కంటే తక్కువ ధరలో 5G ఫోన్‌ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇటీవల ఇండియాలో Redmi 12 4G అలాగే Redmi 12 5Gలను ప్రారంభించింది. అయితే Redmi 12 5G చాలా స్టైలిష్‌గా ఫోన్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వచ్చింది. 5000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌తో చూడటానికి భలేగా ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Redmi 12 5G & Redmi 12 4G ధరలు

Redmi 12 4G ధర గురించి మాట్లాడితే 4GB + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ.9,999. అలాగే 6GB + 128GB మోడల్ ప్రారంభ ధర రూ.11,499. అయితే Redmi 12 5G 4GB+128GB వేరియంట్ రూ.11,999 నుంచి ప్రారంభమవుతుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,499గా నిర్ణయించారు. ICICI క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల నుంచి చెల్లింపులు చేస్తే వెయ్యి రూపాయల తక్షణ తగ్గింపుని పొందుతారు.

Redmi 12 5G స్పెసిఫికేషన్స్

Redmi 12 5G 90Hz రిఫ్రెష్ రేట్, 550 nits బ్రైట్‌నెస్‌తో 6.79-అంగుళాల FHD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 2 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ది బాక్స్‌ ద్వారా రన్ అవుతుంది. Redmi 12 5Gలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ షూట్ ఉన్నాయి. ముందువైపు 8MP సెల్ఫీ షూటర్ ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది.

Redmi 12 4G స్పెసిఫికేషన్‌లు

Redmi 12 4G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు వైపు 8MP షూటర్ ఉంది. ఇది కూడా 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tags:    

Similar News