World Cup 2023 Semifinal: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే.. లిస్టులో భారత్‌కు బద్ద శత్రువు..!
World Cup 2023 Semifinal: ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రపంచ కప్ 2023లో అజేయంగా ఉన్నాయి. దీంతో ఇరు జట్లు సెమీఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం.
India and New Zealand: ప్రపంచ కప్ 2023 క్రమంగా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటి వరకు ఆతిథ్య భారత్, గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ మాత్రమే టోర్నీలో అజేయంగా నిలిచాయి. ఇరు జట్లు 4 మ్యాచ్‌లు ఆడగా, అన్నింటిలో జట్లు విజయం సాధించాయి. ఇరు జట్ల విజయ పరంపర కొనసాగుతుండడంతో ఈ రెండు జట్లు సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం అని స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి జట్ల పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం, న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ +1.923తో అగ్రస్థానంలో ఉంది. టీమ్ ఇండియా 8 పాయింట్లు, నెట్ రన్ రేట్ +1.659 తో రెండవ స్థానంలో ఉంది. టేబుల్‌లోని టాప్-4 జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే ఏ జట్టు అయినా 9 లీగ్ మ్యాచ్‌లలో 7 గెలవాలి. ఇటువంటి పరిస్థితిలో, తదుపరి 5 మ్యాచ్‌లలో భారత్, న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.
కాగా, టోర్నీలో ఫేవరెట్‌గా చెప్పుకునే పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 3 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 2 గెలుపొందగా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల్లో ఒక్కో మ్యాచ్ గెలిచాయి. మూడు జట్ల నెట్ రన్ రేట్ ప్రతికూలంగా ఉంది. దక్షిణాఫ్రికా జట్టు 3 మ్యాచ్‌లలో 2 గెలిచి మూడవ స్థానంలో ఉంది. జట్టు రన్ రేట్ కూడా సానుకూలంగా ఉంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్..
ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్లు అక్టోబర్ 22 ఆదివారం ధర్మశాలలో తలపడతాయి. ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఓ జట్టు విజయాల పరంపరకు బ్రేక్ పడనుంది. ఆదివారం ఏ జట్టు గెలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను భారత జట్టు ఓడించింది. అదే సమయంలో, న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌లలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లను ఓడించింది.