World Cup Trophy: ఆ థ్రిల్లింగ్ విక్టరీకి నేటితో ఏడాది!

World Cup Trophy: క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ దేశానికి ప్రపంచకప్ అందుకోవడానికి నాలుగు దశాబ్దాల సమయం పట్టింది.

Update: 2020-07-14 09:00 GMT
2019 World Cup Champions (File Photo)

World Cup Trophy: క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ దేశానికి ప్రపంచకప్ అందుకోవడానికి నాలుగు దశాబ్దాల సమయం పట్టింది. గత ఏడాది (2019)లో లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో తలబడిన ఇంగ్లాండ్ జట్టు అనూహ్యరీతిలో మ్యాచ్ ని గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఆ ఆనంద సమయానికి నేటితో సంవత్సరం పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆ మ్యాచ్ తాలూకు జ్ఞాపకాలని మరోసారి గుర్తు చేసుకుందాం..

నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు అత్యుత్తమైన ప్రదర్శనని కనబరిచాయి. మొదటగా రెండు జట్లు ఒకే స్కోర్ చేశాయి. ఆ తర్వాత రెండు జట్ల మధ్య సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా అందులో కూడా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగి అక్కడ కూడా సమానమైన స్కోర్ ని సాధించాయి. ఇక చేసేది ఏమీ లేకా బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్‌ కప్‌ గెలిస్తే న్యూజిలాండ్‌ మనసులు గెలిచింది.

మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనమిది వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఆ జట్టులో హెన్రీనికోల్స్‌(55), టామ్‌ లాథమ్‌(47), కేన్‌ విలియ్సన్‌(30) పరుగులు చేసి జట్టుకు ఆ మాత్రం స్కోర్ అయిన అందించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు క్రిస్‌వోక్స్‌(3/37), లియమ్‌ప్లంకెట్‌(3/42) వికెట్లు తీశారు. దీనితో ఇంగ్లాండ్ జట్టుకి విజయం నల్లేరు పై నడకే అని అందరూ అనుకున్నారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లీష్ జట్టుకి న్యూజిలాండ్‌ బౌలర్లు పెద్ద షాక్ ఇస్తూ వరుసగా వికెట్లు తీయడం మొదలు పెట్టారు. దీనితో స్వల్ప లక్ష్యం కాస్తా భారీగా కనిపించింది. ఆ తర్వాత బెన్‌స్టోక్స్‌(84), జాస్‌బట్లర్‌(59) నిలకడగా ఆడడంతో స్కోర్ బోర్డు పెరిగింది. ఆ తర్వాత కివీస్‌ బౌలర్లు పుంజుకోవడంతో ఇంగ్లాండ్‌ టెయిలెండర్లపై ఒత్తిడి పెరిగింది. అయితే బెన్‌స్టోక్స్‌ మాత్రం ఒంటరిగా పోరాడాడు. ఇక ఆట చివరి బంతికి మళ్లీ రెండు పరుగులు అవసరం అనుకున్న క్రమంలో ఆ జట్టు బాట్స్ మెన్ మార్క్‌వుడ్‌ రనౌటయ్యాడు. దీనితో మ్యాచ్ టైగా ముగిసింది.

సూపర్  ఓవర్ లో కూడా ఇరు జట్లు సూపర్ :

ఇక సూపర్ ఓవర్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 15 పరుగులు చేసింది. ఆ తరవాత లక్ష్య చేదనకి దిగిన న్యూజిలాండ్‌ కూడా అన్నే పరుగులు చేయడంతో మరోసారి మ్యాచ్ టైగా ముగిసింది. దీనితో చేసేది ఏమీ లేకా బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో న్యూజిలాండ్ వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ ని కోల్పోగా, ఇంగ్లాండ్ మొదటిసారిగా కప్ గెలుచుకుంది. 



Tags:    

Similar News