Tokyo Olympic: టోక్యో చేరిన ఒలింపిక్ జ్యోతి
Tokyo Olympic: ఒలింపిక్స్ లో కీలక ఘట్టమైన 'ఒలింపిక్ జ్యోతి' ఆతిథ్య జపాన్ చేతికి చేరుకుంది.
Tokyo Olympic: ఒలింపిక్ జ్యోతి క్రీడల వేదికైన టోక్యో చేరింది. ఒలింపిక్స్ లో కీలక ఘట్టమైన 'ఒలింపిక్ జ్యోతి' ఆతిథ్య జపాన్ చేతికి చేరుకుంది. శుక్రవారం జపాన్ రాజధానిలో జ్యోతి ఆవిష్కరణను కరోనా కారణంగా నిరాడంబరంగా నిర్వహించారు. టోక్యోలో ఎమర్జెన్సీ నేపథ్యంలో జ్యోతి యాత్రను ప్రధాన వీధుల గుండా కాకుండా టోక్యో తీరప్రాంత గ్రామాలైన కమోగవా, సైతామా, చిబా ద్వీపాల్లో మాత్రమే తిరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జ్యోతి అన్ని దేశాల్లో తిరుగుతూ ప్రారంభోత్సవాలనికి టోక్యో నగరానికి చేరుకోవాల్సి ఉంది. కానీ కరోనాతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా రద్దు కాగా.. జపాన్‌లోని అన్ని రాష్ట్రాల్లోనూ ఒలింపిక్స్ జ్యోతిని తిప్పేందుకు నిర్వాహకులు తొలుత ప్రయత్నించారు. అది కూడా ఈ ఏడాది మార్చి నుంచి పూర్తి రద్దు చేయబడింది.
రెండు వారాల్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు మళ్లీ జ్యోతి ప్రజ్వలనను తిరిగి ప్రారంభించారు. ఇది టోక్యోలోని తీరప్రాంత గ్రామాల్లో నామమాత్రంగా తిరిగి ప్రారంభోత్సవాల రోజైన జులై 23నాటికి ఒలింపిక్ స్టేడియానికి చేరుకోనుంది. ప్రధాన స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనతో 2020 ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఇక ప్రారంభోత్స వేడుకలకు ప్రేక్షకుల అనుమతిని రద్దు చేయడంతో కొద్దిమంది విఐపిలు, అధికారులు, అథ్లెట్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
కాగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒలింపిక్ బౌండ్ అథ్లెట్లతో 13న వర్చ్యువల్‌గా సంభాషించనున్నారు. టోక్యోకు అథ్లెట్ల తొలిబ్యాచ్ బయల్దేరడానికి మూడు రోజుల ముందు ప్రధాని వీరితో సంభాషించనున్నారు. కరోనా వైరస్ కారణంగా.. టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదాపై అనేక ఊహాగానాలు వినిపించాయి.