Wimbledon 2021: సానియా జోడీ శుభారంభం

Wimbledon 2021: మహిళల డబుల్స్‌ లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, బెథానీ మాటెక్‌ జోడీ తొలి రౌండ్ లో విజయం సాధించారు.

Update: 2021-07-02 05:40 GMT

Sania Mizra:(File Image)

Wimbledon 2021: మహిళల డబుల్స్‌ లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, బెథానీ మాటెక్‌ జోడీ తొలి రౌండ్ లో విజయం సాధించారు. అమెరికన్ క్రీడాకారిణి బెథానీ మాటెక్ శాండ్స్ తో కలిసి వింబుల్డన్ లో ఆడుతున్న సానియా, తొలి రౌండ్ లో ఆరో సీడ్ గా బరిలోకి దిగిన యూఎస్ - చిలీ జోడి డెసిరె క్రాజక్ - అలెక్సా గురాచీతో పోటీ పడిన సానియా జంట 7-5, 6-3 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లింది. ఇంకో మ్యాచ్ లో లారెన్ డెవిస్ తో కలసి బరిలోకి దిగిన అంకిత రైనా తొలి రౌండ్ లోనే ఓడిపోయింది.

సానియా కెరీర్‌లో ఇది 121 విజయం. అయితే, సానియా ఈ మ్యాచ్ లో ఒకే ఒక్క ఏస్ సంధించింది. 2017లో చివరిసారిగా ఈటోర్నీలో ఆడింది. ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న వింబుల్డన్ 2021 టోర్నీ ఈ 34 ఏళ్ల హైదరాబాద్ ప్లేయర్ కు చాలా కీలకం. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్తరఫున బరిలోకి దిగనుంది సానియా మీర్జా. ఇప్పటి వరకు 4 ఒలింపిక్స్ల్లో సానియా పాల్గొంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత ప్లేయర్లు బోపన్న-దివిజ్‌ శరణ్‌ జోడీ 6-7 (6-7), 4-6తో ఫిన్లాండ్ ప్లేయర్ కొంటినెన్‌, ఫ్రాన్స్ ప్లేయర్ రోజర్‌-వాసెలిన్‌ జంట చేతిలో ఓడింది.

వింబుల్డన్‌లో 3వ సీడ్‌ ఉక్రెయిన్ ప్లేయర్ ఎలినా స్వితోలినా రెండో రౌండ్లో ఓడిపోయింది. పోలెండ్‌కు చెందిన లినెట్టె 6-3, 6-4తో స్వితి ఓడిపోయింది. ఇప్పటి వరకు డబ్ల్యూటీఏ టాప్‌-11 ప్లేయర్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. మరోవైపు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ బార్బరా క్రెజికోవా, టాప్‌ సీడ్‌ బార్టీ తదుపరి రౌండ్ లోకి ప్రవేశించారు.

వింబుల్డన్ లో ఎన్నో విజయాలు సాధించి, మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలవడమే లక్ష్యంగా ఈ దఫా బరిలోకి దిగిన స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, తనలో ఎంతమాత్రమూ సత్తా తగ్గలేదని నిరూపిస్తూ, మూడవ రౌండ్ లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో ఆరవ సీడ్ గా బరిలోకి దిగిన ఫెదరర్, రెండో రౌండ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ కు చెందిన రిచర్డ్ గ్యాస్కట్ తో తలపడి గెలిచాడు. మూడు వరుస సెట్లలో 7-6(1), 6-1, 6-4 తేడాతో ఫెదరర్ గెలవడం గమనార్హం.

Tags:    

Similar News