Yuvraj Singh: యువరాజ్ సింగ్ మళ్లీ రంగంలోకి దిగుతాడా..!
Yuvraj Singh: టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ అంటే తెలియనివారుండరు. సిక్సర్ల వీరుడు. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన క్రికెటర్
Yuvraj Singh: టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ అంటే తెలియనివారుండరు. సిక్సర్ల వీరుడు. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన క్రికెటర్. ఇతడు క్రీజులో ఉంటే క్రికెట్ అభిమనులకు పండగే. బౌలర్లకు మాత్రం చుక్కలు చూపిస్తాడు. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. అద్బతమైన ఫీల్డింగ్, అసాధారణ బౌలింగ్ ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు టీమిండియాలో ఇతడి స్థానాన్ని భర్తీ చేసే అటగాడు లేడంటే నమ్మండి. నిజానికి యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు మళ్లీ వచ్చేందుకు సంకేతాలు ఇస్తున్నాడు. దీనిని క్రికెట్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు టీ 20లో టీమిండియా పేలవ ప్రదర్శన చూశాక ఎవ్వరికైనా యువరాజ్ రావాలనే ఉంటుంది.
2011 ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన యువరాజ్ సింగ్, ఫిబ్రవరి 2022లో మళ్లీ పిచ్‌పైకి వస్తానని సూచిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశాడు. యువరాజ్ అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇంగ్లాండ్‌పై 150 పరుగుల ఇన్నింగ్స్. అతను 'తేరి మిట్టి' పాటలో తన బ్యాటింగ్ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. తన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పుడు యువరాజ్ ఇలా రాశాడు. "మీ విధిని దేవుడు నిర్ణయిస్తాడు. ప్రజల డిమాండ్‌పై, నేను మరోసారి ఫిబ్రవరిలో పిచ్‌కి వెళ్తాను. ఈ అనుభూతి కంటే నాకు ఏదీ ముఖ్యమైనది కాదు. ఇందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అన్నాడు.
యువరాజ్ సింగ్ భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 11000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 71 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యువరాజ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతడిని అడ్డుకోవడం ప్రత్యర్థి జట్లకు కష్టమవుతుంది. 11000 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాట అతను 148 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇందులో 4 వికెట్లు రెండుసార్లు , 5 వికెట్లు ఒకసారి ఉన్నాయి.