IND vs WI 2nd ODI: టాస్ గెలిచిన విండీస్.. టీమిండియా నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. ప్లేయింగ్ 11లో బ్యాడ్‌లక్ ప్లేయర్‌కి ఛాన్స్..!

West Indies vs India: బార్బడోస్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది.

Update: 2023-07-29 13:57 GMT

IND vs WI 2nd ODI: టాస్ గెలిచిన విండీస్.. టీమిండియా నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. ప్లేయింగ్ 11లో బ్యాడ్‌లక్ ప్లేయర్‌కి ఛాన్స్..!

West Indies vs India: బార్బడోస్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పు చేసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా టాస్‌ వేసేందుకు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం లేదు. ఈ ఇద్దరి స్థానంలో సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లకు అవకాశం దక్కింది.

ఇరుజట్లు ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అతానాజ్, షాయ్ హోప్ (కీపర్ & కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, కేసీ కార్తీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోట్టి, జాడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్.

భారత్: హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

విజయంతో భారత్‌ శుభారంభం..

భారత్‌ విజయంతో సిరీస్‌ను ప్రారంభించింది. భారత్‌కు ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి 46 బంతుల్లో 52 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. ఫీల్డింగ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా రాణించారు. దీంతో పాటు కోహ్లి, జడేజా అద్భుతమైన క్యాచ్‌లు పట్టి జట్టును మ్యాచ్‌లో పటిష్టంగా నిలిపారు. బౌలింగ్‌లో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశారు. ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ మళ్లీ జట్టులోకి వచ్చాడు.

Tags:    

Similar News