Wasim Jaffer Comment on Sourav Ganguly: నేను చూసిన బెస్ట్ కెప్టెన్ గంగూలీనే: వసీం జాఫర్

Wasim Jaffer Comment on Sourav Ganguly: నేను చూసిన కెప్టెన్ లలో దాదా( సౌరవ్ గంగూలీ)నే బెస్ట్ కెప్టెన్ అంటూ చెప్పుకొచ్చాడు ఇండియన్ మాజీ క్రికెటర్ వసీం జాఫర్..

Update: 2020-07-05 10:18 GMT

Wasim Jaffer Comment on Sourav Ganguly: నేను చూసిన కెప్టెన్ లలో దాదా( సౌరవ్ గంగూలీ)నే బెస్ట్ కెప్టెన్ అంటూ చెప్పుకొచ్చాడు ఇండియన్ మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. గంగూలీ కెప్టెన్సీలో ఎదో తెలియని జ్వాల ఉంటుందని అన్నాడు.. దాదా చాలా మంది ఆటగాళ్లను ప్రోత్సహించడని అన్నాడు.. వీరేంద్ర సెహ్వాగ్ ని ఓపెనర్ చేసింది. యువీ,భజ్జీ లాంటి ఆటగాళ్లను దాదా వెలుగులోకి తెచ్చాడని జాఫర్ పేర్కొన్నాడు.

తాను కూడా గంగూలీ కెప్టెన్సీలో కొన్ని మ్యాచ్‌లు ఆడానని, ఆ సమయంలో గంగూలీ సమయస్పూర్తి, గెలుపుకోసం పడే తాపత్రయం తనను ఎంతగానో ఆకర్షించేవని చెప్పాడు..మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో కుప్పకూలిన టీమ్‌ఇండియాను తిరిగి అతడు ప్రపంచ స్థాయిలో నిలిపాడని జాఫర్ అన్నాడు. టీం ఇండియా జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉన్న సమయంలో వసీం జాఫర్ జట్టుకు ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత గంగూలీ ,ద్రావిడ్,కుంబ్లే, ధోని కెప్టెన్సీ లలో జాఫర్ ఆడాడు..

భారత్ తరుపున వసీం జాఫర్ 2000 నుంచి 2008 వరకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 31 టెస్టు మ్యాచ్‌లాడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి.రెండు దశాబ్దాల పాటు క్రికెట్లో కొనసాగిన జాఫర్‌ ఈ ఏడాది మార్చిలో ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ఇక అటు గంగూలీ 2001 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించి అత్యధిక టెస్ట్ విజయాలు(21)ను అందించిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు..2003 ప్రపంచ కప్ క్రికెట్ లో ఫైనల్ చేరిన భారత జట్టుకు నాయకుడు కూడా గంగూలీనే కావడం విశేషం..

ఇక మొత్తం అతని కెప్టెన్సీ లో భారత జట్టు 146 వన్డేల అడగా, 76 గెలిచి 65 ఓడింది. 5 మ్యాచుల ఫలితాలు తేలలేదు. ఇక 49 టెస్టులకు సారథ్యం వహించగా 21 గెలిచి 13 ఓడింది. 15 మ్యాచుల్ని డ్రా చేసుకుంది.2008 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీసుతో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన గంగూలీ ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.


Tags:    

Similar News