చిక్కుల్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ!

మిండియా సారథి విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. కోహ్లీ బీసీసీఐ రాజ్యాంగంలోని 38 (4) నిబంధనకు వ్యతిరేకించారని సమాచారం.

Update: 2021-01-06 13:32 GMT

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. కోహ్లీ బీసీసీఐ రాజ్యాంగంలోని 38 (4) నిబంధనకు వ్యతిరేకించారని తెలుస్తోంది. ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టు అనంతరం కోహ్లీ స్వదేశానికి పయమైయ్యడు. తన భార్య అనుష్క శర్మ బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ భారత్‌లోనే ఉన్నాడు.

అయితే కోహ్లీ ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్ర‌స్తుతం బీసీసీఐ అధికారిక కిట్ స్పాన్స‌ర్‌గా ఉన్న మొబైల్ ప్రిమియ‌ర్ లీగ్ (ఎంపీఎల్‌) సంస్థ‌లో కోహ్లీకి పెట్టుబడులు దీనికి కారణం. గతేడాది జ‌న‌వ‌రిలో ఎంపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కోహ్లీని నియమించారు. అప్పుడే అత‌ని పేరిట రూ.33.32 ల‌క్ష‌ల విలువైన‌ 68 సీసీడీల‌ను కేటాయించారు. వీటిని ప‌దేళ్ల త‌ర్వాత ఈక్విటీ షేర్ల‌లోకి మార్చుకోవ‌చ్చు. ఆ లెక్క‌న విరాట్ కోహ్లీకి ఎంపీఎల్‌ కంపెనీలో 0.051 శాతం వాటా ఉన్న‌ట్లే. ఇదే ఎంపీఎల్ స్పోర్ట్స్‌ను గతేడాది నవంబ‌ర్ 17న అధికారిక కిట్ స్పాన్స‌ర్‌గా బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ ఎంపీఎల్ లోగో ఉన్న జెర్సీల‌ను ఆస్ట్రేలియా టూర్ నుంచే టీమిండియా వేసుకుంటోంది. మూడేళ్ల పాటు ఈ సంస్థ‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కోహ్లికి ఈ సంస్థ‌లో వాటా ఉన్న‌ట్లు బీసీసీఐకి తెలియ‌ద‌ని ఓ బోర్డు అధికారి చెప్ప‌డం చెప్పుకోదగ్గ పరిణామం.

కోహ్లీ ప‌రస్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల అంశాన్ని ఎథిక్స్ ఆఫీస‌ర్ డీకే జైన్ గత ఏడాది జులైలోనే లేవ‌నెత్తారు. ఈ అంశంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. ఈ విషయంలోనే గతంలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ సహాపలువురు క్రీడాకారులపై మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీ కూడా ఈ వివాదంలో చిక్కుకున్నాడు. కోహ్లీపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచిచూడక తప్పదు. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు, జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌ వేదికగా చివరిదైన నాలుగో టెస్టు జరుగనుంది.

Tags:    

Similar News