IPL 2023: కోహ్లీకి షాక్.. ఫైన్ వేసిన ఐపీఎల్ నిర్వాహకులు..!

Virat Kohli: చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది.

Update: 2023-04-18 09:31 GMT

IPL 2023: కోహ్లీకి షాక్.. ఫైన్ వేసిన ఐపీఎల్ నిర్వాహకులు..!

Virat Kohli: చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్ లో చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో కోహ్లీ అనూహ్యంగా అవుట్ అయ్యాడు. ఆకాష్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించగా అది ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకొని కాళ్లకు తగిలింది. ఇది గమనించని కోహ్లీ వెనక్కి తిరగ్గా..బంతి అతని కాలికి తగిలి వికెట్లను తాకింది. దీంతో కోహ్లీ నిరాశాజకంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ సమయంలో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను కోహ్లీ అతిక్రమించాడు.

చెన్నై ఆల్ రౌండర్ శివమ్ దూబే అవుట్ అయినప్పుడు కోహ్లీ చాలా ఎగ్రసివ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడిన దూబే 17వ ఓవర్ లో కూడా ఒక భారీ సిక్సర్ బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద సిరాజ్ అందుకున్న సూపర్ క్యాచ్ కు పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కోహ్లీ కాస్త అతిగా స్పందించాడు. సిరాజ్ క్యాచ్ అందుకోగానే కోహ్లీ తన చేతిని కిందకు పంచ్ చేస్తూ ఏదో అభ్యంతరకర వర్డ్ కూడా అన్నాడు. అంతకుముందు గైక్వాడ్ అవుటైన సందర్భంలో కూడా ఇదే రీతిలో అగ్రెసివ్ గా బిహేవ్ చేశాడు.

కోహ్లీ ప్రవర్తనను బీసీసీఐ తప్పుబట్టింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 లెవల్ వన్ నేరం కింద పరిగణించిన బీసీసీఐ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. దీంతో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చినట్లయింది. ఆటలో అగ్రెసివ్ గా ఉండడం తప్పులేదు కానీ అతి పనికిరాదని చెప్పకనే చెప్పినట్లయింది.

Tags:    

Similar News