Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు
Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు పడింది.
Vinesh Phogat: ఒలింపిక్స్ పతకం ఖాయం అనుకుంటున్న దశలో.. పోరాడి, గెలిచి, నిలిచిన ధీర వనితగా దేశం అంతా కొనియాడుతున్న వినేశ్ ఫోగాట్‌పై ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది. ఫైనల్స్ కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉందంటూ ఒలింపిక్స్ సంఘం అనర్హత వేటు వేసింది. 50 కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా 100గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ డిస్ క్వాలిఫై చేశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయం అయిందని అందరూ భావించారు. కానీ భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాములు అధిక భరువు ఉండటంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తుంది. కాగా మంగళవారం జరిగిన సెమీస్‌లో వినేశ్ ఫోగాట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన యుస్నీలీస్ గుజ్మాన్‌ను మట్టికరిపించి పైనల్ మ్యాచుకు దూసుకెళ్లింది. తాజాగా ఆమెపై అనర్హత వేటు పడిందని తెలియడంతో భారత్ ప్రజలు నిరాశకు గురయ్యారు.
‘‘వినేశ్ ఫోగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేశ్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం’’ అని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.