Vinesh Career Records: కామన్వెల్త్ నుండి ఆసియా క్రీడల వరకు..వినేష్ ఫోగాట్ రెజ్లింగ్ జర్నీ ఇదే

Vinesh Phogat Wrestling Career :పారిస్ ఒలింపిక్స్ 2024లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు.. ఆగస్టు 7న భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనూహ్య రీతిలో అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-08 03:25 GMT

Vinesh Career Records: కామన్వెల్త్ నుండి ఆసియా క్రీడల వరకు..వినేష్ ఫోగాట్ రెజ్లింగ్ జర్నీ ఇదే 

Vinesh Phogat Wrestling Career : భారతీయ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుస్తుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న తీరు..వినేష్ తప్పకుండా పసిడి గెలిచి..భారత భూమిని ముద్దాడుతుందని కలలు కన్నారు. స్వర్ణ పతక మ్యాచ్‌కు ముందు ఆమెకు 100 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఆశలన్నీ ఆవిరయ్యాయి. యావత్ భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

వినేష్ ఫొగాట్ అధిక బరువు కారణంగా అనర్హురాలని ఒలింపింక్ సంఘం ప్రకటించింది. దీంతో దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. కేవలం 100 గ్రాముల బరువుతో అనర్హురాలని ప్రకటించడం దారుణమంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందులో ఏదో కుట్ర ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అనూహ్య రీతలో ఫోగాట్ ను అనర్హురాలని ప్రకటించడం ఆమె కూడా తట్టుకోలేకపోయింది.

తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరింది. కేవలం 100 గ్రాముల బరువును తగ్గించుకునేందుకు ఫొగాట్ తన ప్రాణాన్నే పణంగా పెట్టి తలవెంట్రుకలు,ఒంట్లో రక్తాన్ని సైతం తీసింది. అయినా కూడా కొంచెం తేడాతో అనర్హరాలైంది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వినేష్‌కి కూడా ఈ నిర్ణయంతో పెద్ద షాక్ తగిలింది. గురువారం ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు వేదికగా రిటైర్మెంట్ ప్రకటించింది వినేష్. కానీ ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలు వినేష్ ఖాతాలో బోలేడు ఉన్నాయి. ఆమె కెరీర్ గురించి తెలుసుకుంటే వాహ్హ వినేష్ అనకతప్పదు.  కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఆసియా క్రీడలలో అనేక పతకాలను గెలుచుకున్న వినేష్ కెరీర్ గురించి ఓసారి చూద్దాం.

2013లో కెరీర్‌లో తొలి విజయం:

వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌ కుటుంబం నుండి వచ్చింది. ఆమెకు చిన్నతనం నుండి ఈ క్రీడ అంటే ఇష్టం. వినేష్ తన మామ మహావీర్ సింగ్ ఫోగట్ నుండి రెజ్లింగ్‌లో తన ప్రాథమిక ట్రైనింగ్ తీసుకుంది. దీని తర్వాత వినేష్ 2013లో యూత్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించారు. ఇక్కడి నుండి ఆమె కెరీర్‌కు దారి దొరికింది. అదే సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వినేష్ 51 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ఇక ఇక్కడి నుంచి వెనుదిరిగి చూడని వినేశ్‌ 2014లో ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించి వార్తల్లో నిలిచారు. వినేష్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆమె తన కెరీర్‌లో చాలా పతకాలు సాధించింది. అతను కామన్వెల్త్ క్రీడలలో తన పేరు మీద 3 బంగారు పతకాలను కలిగి ఉన్నారు. అయితే అతను ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఒక్కొక్కటి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.

వినేష్ అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న:

క్రీడల్లో ఆమె చేసిన విశేష కృషికి గాను 2016లో భారత ప్రభుత్వం వినేష్ ఫోగట్‌కు అర్జున అవార్డును అందించగా, 2020లో ఆమె దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును కూడా అందుకుంది.

వినేష్ ఫోగట్ తన కెరీర్‌లో రెజ్లింగ్‌లో ఈ పతకాలు సాధించింది.

2013   ఆసియా        రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్            న్యూఢిల్లీ        51 కిలోలు                  కాంస్య పతకం

 2014 కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గో 48 కిలోగ్రాములు స్వర్ణ పతకం

2015 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ దోహా 48 కిలోగ్రాములు వెండి పతకం

2016 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ బ్యాంకాక్ 53 కిలోగ్రాములు కాంస్య పతకం

2017 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ న్యూఢిల్లీ 55 కిలోగ్రాములు వెండి పతకం

2018 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ బిష్కెక్ 50 కిలోగ్రాములు వెండి పతకం

2018 ఆసియా గేమ్స్ జకార్తా 50 కిలోగ్రాములు స్వర్ణ పతకం

2019 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ జియాన్ 53 కిలోగ్రాములు కాంస్య పతకం

2019 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ నూర్-సుల్తాన్ 53 కిలోగ్రాములు కాంస్య పతకం

2020 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ న్యూఢిల్లీ 53 కిలోగ్రాములు కాంస్య పతకం

2021 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఆల్మటీ 53 కిలోగ్రాములు స్వర్ణ పతకం

2022 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ బెల్గ్రేడ్ 53 కిలోగ్రాములు కాంస్య పతకం

2022 కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్‌హామ్ 53 కిలోగ్రాములు స్వర్ణ పతకం

Tags:    

Similar News