Umar Gul: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు చెప్పిన పాక్ పెసర్
Umar Gul: పాకిస్థాన్ వెటరన్ పేసర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటు న్నట్టు 36 ఏళ్ల గుల్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
Umar Gul: పాకిస్థాన్ పేసర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్ ఆరంభిస్తానని తెలిపారు. త్వరలో జరగనున్న జాతీయ టీ20 కప్.. ఆటగాడిగా అతడికి ఆఖరిది.
2003లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఉమర్ గుల్ . తొలుత వన్డే మ్యాచ్ జింబాబ్వే తో ఆడారు. అదే ఏడాది టెస్ట్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 2016లో ఇంగ్లండ్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
ఉమర్ తన కెరీర్‌లో 47 టెస్టులాడి 163 వికెట్లు పడగొట్టాడు. అలాగే 130 వన్డేల్లో 179, 60 టీ20ల్లో 85 వికెట్లు తీశాడు. 2009లో టీ20 వరల్డ్‌కప్‌ను పాకిస్థాన్ గెలవడంలో ఉమర్ గుల్ కీలక పాత్ర పోషించాడు. .