క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ ఇకలేరు

ప్రముఖ భారత మాజీ క్రికెటర్, క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ మరణించారు.

Update: 2020-06-13 06:39 GMT

ప్రముఖ భారత మాజీ క్రికెటర్, క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ మరణించారు. ఆయన వయసు 100 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా దక్షిణ ముంబైలోని వల్కేశ్వర్‌లోని తన నివాసంలో ఆయన (రాయ్‌జీ) తెల్లవారుజామున 2.20 గంటలకు కన్నుమూశారు అని అల్లుడు సుదర్శన్ తెలిపారు. ఆయనకు భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాయ్‌జీ కుడిచేతి వాటం బ్యాట్స్ మాన్, 1940 లలో తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడారు, 277 పరుగులు చేశాడు, 68 ఆయన అత్యధిక స్కోరు. 1939 లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జట్టు ద్వారా అరంగేట్రం చేశారు.

ఆ సమయంలో నాగ్‌పూర్‌లో సెంట్రల్ ప్రావిన్స్ , బెరార్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ తరువాత 1941లో ముంబైలో వెస్ట్రన్ ఇండియా జట్టు తరుపున ఆడారు. దక్షిణ ముంబైలోని బొంబాయి జిమ్‌ఖానాలో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు రాయిజీ వయసు 13 సంవత్సరాలు. ఈ ఏడాది జనవరిలో 100 ఏళ్లు పూర్తిచేసుకున్న రాయిజీని క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ , ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో దహన సంస్కారాలు జరుగుతాయని తెలిసింది.

Tags:    

Similar News