శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న క్రీడాకారిణి త్రిష

* మహిళల టీ20 క్రికెట్ ప్లేయర్ త్రిషకు అభినందనలు

Update: 2023-02-02 07:03 GMT

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న క్రీడాకారిణి త్రిష

Gongadi Trisha: హైదరాబాద్‌కు చేరుకున్న ఉమెన్ టీ-20 క్రికెట్ ప్లేయర్ త్రిషకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ త్రిషకు స్వాగతం చెప్పారు. జరిగిన ICC అండర్- 19 మహిళల టీ-20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో మూడు ఫోర్లతో 24 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణకు చెందిన త్రిషపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టును విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన త్రిషకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News