Asia Cup 2023: ఆసియా కప్‌లో రేపు హైఓల్టేజ్ మ్యాచ్.. ఇండియా-పాక్ మధ్య తొలిపోరు
Asia Cup 2023: 10 నెలల విరామం తర్వాత తలపడుతున్న ఇరుజట్లు
Asia Cup 2023: ఇప్పుడు అంతా ఆసియా కప్ ఫీవర్ నడుస్తోంది. అందులోని అన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ మరో ఎత్తు. భారత్ - పాక్ క్రికెట్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. క్రికెట్‌లో ఈ రెండు దేశాలు తలపడుతున్నాయంటే ఆ కిక్కు మామూలుగా ఉండదు. మ్యాచ్ ఎక్కడనేదానితో పనిలేకుండా.. స్టేడియాలన్నీ అభిమానులతో నిండిపోతాయి. అటు.. టీవీ, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ కూడా టీఆర్పీ రేటింగులు కొత్త రికార్డులు సృష్టిస్తాయి.
ఆసియా కప్‌లో భాగంగా రేపు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పల్లెకెలె వేదికగా వన్డే మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. దాదాపు పదినెలల విరామం తర్వాత పాకిస్తాన్‌తో భారత్ తలపడుతోంది. ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై అద్భుతమైన రికార్డును టీమిండియా కలిగి ఉంది. దీంతో ఆసియా కప్‌లో బోణీ కొట్టేందుకు ఇరు జట్లు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ మ్యాచ్ మొత్తం ఆధిపత్యపోరు కనబర్చే విధంగా ఉంటుందని స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.