Tokyo Paralympics 2020: నేటితో ముగియనున్న పారాలింపిక్స్, భారత్‌కు 17 పతకాలు
Tokyo Paralympics 2020: ముగింపు వేడుకల్లో జాతీయ జెండాతో ముందుకు సాగనున్న అవని లేఖర...
Tokyo Paralympics 2020: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ ఇవాల్టీతో ముగియనున్నాయి. ఈ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన షూటర్ అవని లేఖర ముగింపు వేడుకల్లో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించనుంది. 19 ఏళ్ల అవని 10 మీటర్ల రైఫిల్ స్టాండింగ్ SH 1లో పతకం సాధించగా, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ SH1లో కాంస్య పతకం సాధించింది. ఈ ఒలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు 17 పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ విశ్వక్రీడల్లో భారత్ నుంచి మొత్తం 54 మంది అథ్లెట్లు 9 అంశాల్లో పోటీపడ్డారు. పతకాల లిస్ట్‌లో నాలుగు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి.