Tilak Varma: 'అరేయ్‌.. ఎవడ్రా మా వాడిని రిటైర్ట్‌ అవుట్‌ చేసింది.. తిలక్‌తో పెట్టుకుంటే తోలుతీస్తాం..'

Tilak Varma: ఇలా రిటైర్డ్‌ అవుట్‌ ఘటన తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తిలక్‌ విధ్వంసం సృష్టించడంతో కేవలం ముంబై ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. ఇటు తెలుగు క్రికెట్‌ లవర్స్‌ సైతం తెగ ఆనందపడుతున్నారు.

Update: 2025-04-14 12:07 GMT
Tilak Varma

Tilak Varma: 'అరేయ్‌.. ఎవడ్రా మా వాడిని రిటైర్ట్‌ అవుట్‌ చేసింది.. తిలక్‌తో పెట్టుకుంటే తోలుతీస్తాం..'

  • whatsapp icon

Tilak Varma: 'అరేయ్‌.. ఎవడ్రా మా వాడిని రిటైర్ట్‌ అవుట్‌ చేసింది.. దమ్ముంటే ఇప్పుడు నా ముందుకు రండి.. తిలక్‌తో పెట్టుకుంటే తోలుతీస్తాం.. లేదు లేదు ఉతికి ఆరేస్తాం.. తెలుగోడి దెబ్బ ఏంటో చూపిస్తాం..' ఈ డైలాగులు వదులుతుంది మరేవరో కాదు.. మన తెలుగు క్రికెట్‌ అభిమానులే! ఈ ఐపీఎల్‌ సీజన్‌లో లక్నోపై మ్యాచ్‌లో తిలక్‌ వర్మను రిటైర్డ్‌ అవుట్‌ అవ్వాలని ముంబై కోచ్‌, కెప్టెన్‌ ఆదేశించడం పెద్ద దుమారమే రేపింది. ఈ ఎపిసోడ్‌పై కెప్టెన్‌ పాండ్యా ప్రతీసారి స్టేట్‌మెంట్లు మార్చుతూ వచ్చాడు. 23 బంతుల్లో 25 పరుగులు చేసిన తిలక్‌ను ఆట చివరి దశకు చేరుకున్న సమయంలో ముంబై డగౌట్‌ పెద్దలు వెనక్కి పిలవడాన్ని ఫ్యాన్స్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అటు తిలక్‌ మాత్రం బ్యాట్‌తోనే గట్టిగా సమాధానం చెబుతున్నాడు. ఆ ఇన్సిడెంట్‌ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ మన హైదరాబాదీ కుర్రాడు దుమ్ములేపాడు. వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు చేసి తనను తక్కువ చేసిన వాళ్ల నోర్లు మూయించాడు.

ఢిల్లీపై మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ప్రారంభం అంతగా అనుకూలంగా రాలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో ముంబై ప్రాధమికంగా ఒక్క వికెట్ కోల్పోయినా, ర్యాన్ రికెల్టన్ – సూర్యకుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్‌కి పునాది వేశారు. ఈ జోడీ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి 59 పరుగులు సాధించింది. కానీ పవర్‌ప్లే అనంతరం రంగంలోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బంతితో రికెల్టన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రికెల్టన్ అర్ధ సెంచరీ పూర్తి చేయకముందే వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి సూర్య చక్కటి భాగస్వామ్యం కలిపాడు. విప్రజ్ బౌలింగ్‌లో వరుసగా 6, 4లు బాదిన సూర్య, ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్ అయ్యాడు. మూడో వికెట్‌కు ఈ ఇద్దరూ కలిపి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయాడు. విప్రజ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

తిలక్ వర్మతో కలిసి నమన్ ధీర్ చివరి దశలో దూకుడుగా ఆడారు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో తిలక్ హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు. నమన్ ధీర్ కూడా బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్‌లో ధీర్ సిక్స్ కొట్టినప్పటికీ అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్‌తో దానిని ఒక్క పరుగు మాత్రమేగా మార్చాడు. మ్యాచ్ చివర్లో ధీర్ భారీ సిక్సర్, బౌండరీలు బాదాడు. తిలక్ వర్మ కూడా భారీ షాట్ ట్రై చేసి అవుట్ అయ్యాడు. అతను 33 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ముంబై భారీ స్కోర్ పెట్టగలిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడానికి తిలక్‌ ఆడిన ఇన్నింగ్సే ప్రధాన కారణం. ఇక గత మ్యాచ్‌లోనూ ఆర్సీబీపై అద్బుతమైన బ్యాటింగ్‌ చేశాడు తిలక్‌. అవవలి ఎండ్‌లో పాండ్యాను పెట్టి మరీ ఉతికిపారేశాడు. ఇలా రిటైర్డ్‌ అవుట్‌ ఘటన తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తిలక్‌ విధ్వంసం సృష్టించడంతో కేవలం ముంబై ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. ఇటు తెలుగు క్రికెట్‌ లవర్స్‌ సైతం తెగ ఆనందపడుతున్నారు.

Tags:    

Similar News