IPL 2021: వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

IPL 2021: మహారాష్ట్ర వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురు సిబ్బంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Update: 2021-04-06 13:06 GMT

IPL 2021:(File Image)

IPL 2021: ఐపీఎల్ కు కరోనా ఫీవర్ పట్టుకుంది. మహారాష్ట్ర వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురు సిబ్బంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఏప్రిల్‌ 9 నుంచి మే 30వ తేదీ వరకు ఐపీఎల్‌ 2021 సీజన్‌ మ్యాచ్‌లు జరుగనుండగా, ముంబాయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌ సిటీలు మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వబోతున్నాయి. అయితే టోర్నీ ఫస్ట్‌ మ్యాచ్‌ చెన్నైలో చెపాక్‌ స్టేడియంలో జరుగనుండగా, రెండో మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్‌ 10న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య కొనసాగనుంది.

అయితే తాజాగా వాంఖడే స్టేడియంలోని ఇటీవల 8 మంది గ్రౌండ్స్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్‌ తేలింది. పెరుగుతున్న కేసులతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో చెన్నై, ఢిల్లీ మధ్య ఏప్రిల్‌ 10వ తేదీన మ్యాచ్‌ జరగడంపై సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సమయంలో కర్ఫ్యూ విధిస్తూ కరోనా కట్టడికి చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేయడం కొసమెరుపు.

ఐపీఎల్ 2021 కోసం భారత్ చేరుకొని క్వారంటైన్ పూర్తిచేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్.. ప్రస్తుతం ఆ జట్టు ఆటగాళ్ల సాధనను పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు, ముంబై ఇండియన్స్ తర్వాత అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్ గా ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్‌లో కచ్చితంగా టైటిల్‌కు ప్రధాన పోటీదారు అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News