IPL 2024: ధోని చివరి సీజన్‌కు రంగం సిద్ధం.. మరోసారి ట్రోఫీ పక్కా అంటోన్న ఫ్యాన్స్..!

IPL 2024: తన కెప్టెన్సీలో భారత జట్టుకు వన్డే, టీ20 ప్రపంచ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి చాలా కాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Update: 2024-03-19 07:16 GMT

IPL 2024: ధోని చివరి సీజన్‌కు రంగం సిద్ధం.. మరోసారి ట్రోఫీ పక్కా అంటోన్న ఫ్యాన్స్..!

IPL 2024: తన కెప్టెన్సీలో భారత జట్టుకు వన్డే, టీ20 ప్రపంచ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి చాలా కాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ధోనీ సారథ్యంలో చెన్నై ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 17వ సీజన్‌లో టైటిల్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఎల్ సీజన్ కోసం ధోనీ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్..

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే, ఐపీఎల్ 2024లో టాప్ ఆర్డర్‌లో డెవాన్ కాన్వేని మిస్ అవుతుంది. అయితే మెగా వేలంలో కొనుగోలు చేసిన రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ బలం పెరిగింది. ఈ జట్టులో ఇప్పటికే రితురాజ్ గైక్వాడ్ టాప్ ఆర్డర్‌లో ఉన్నాడు. చివరి ఓవర్లలో స్కోరు బోర్డుకు పరుగులు జోడించడానికి లేదా మ్యాచ్‌ను ముగించడానికి కెప్టెన్ ధోనీ వంటి ఫినిషర్ కూడా ఉన్నాడు.

సీఎస్‌కే అతి పెద్ద బలం దాని ఆల్ రౌండర్లు. వారు IPLలోని ఇతర జట్ల కంటే మెరుగ్గా కనిపిస్తుంటారు. CSK ఆల్‌రౌండర్‌లుగా శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రాజ్యవర్ధన్ సింగ్ హంగర్గేకర్ ఉన్నారు. చెన్నై బౌలింగ్ విషయానికొస్తే.. మహిష్ తీక్షణ, మతిష్ పతిరణ, నిశాంత్ సింధు, ముస్తిఫిజుర్ రెహమాన్ వంటి బలమైన పేసర్లు ఉన్నారు. IPL 2024 వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా CSK తన బలాన్ని పెంచుకుంది.

ధోనీ లాంటి కెప్టెన్ మ్యాజిక్..

మొత్తంమీద, చెన్నై సూపర్ కింగ్స్ పసుపు జెర్సీలో కనిపించే బలమైన జట్టుగా పరిగణిస్తుంటారు. చెన్నై పగ్గాలు కెప్టెన్ ధోని చేతిలో ఉన్నాయి. ధోని తన ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబడుతుంటాడు.

చెన్నై జట్టు 12 సార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ధోనీ సారథ్యంలో చెన్నై జట్టు 2010, 2011, 2018, 2021, 2023లో 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.

మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అతిపెద్ద బలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ధోనీతో పాటు స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా చాలా కాలంగా జట్టు కోచింగ్‌ను నిర్వహిస్తున్నాడు.

2008లో, చివరి బంతికి ఫైనల్‌లో ఓడిన ధోనీ జట్టు.. ఆ తర్వాత 2009లో సెమీ-ఫైనల్‌లో ఓడిపోయింది. అయితే ఈ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న చెన్నై జట్టు ఆ తర్వాత రెండేళ్లలో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో విజయవంతమైంది.

ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఐపీఎల్‌ ప్లేఆఫ్‌లో చేరలేకపోయింది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా జట్టుపై రెండేళ్ల నిషేధం కూడా విధించింది. 2018లో చెన్నై అద్భుతంగా పునరాగమనం చేసింది. 2018లో ధోనీ జట్టు కూడా ట్రోలింగ్ బారిన పడింది. చెన్నై జట్టు ఆటగాళ్లను 'డాడ్ ఆర్మీ' అని కూడా పిలిచారు. ఎందుకంటే ఆ జట్టులో చాలామంది సీనియర్లే ఉన్నారు. అయినప్పటికీ టైటిల్ మ్యాచ్‌లో ధోనిసేన విజయం సాధించింది.

2020లో, CSK 8 జట్లలో 7వ స్థానంలో నిలిచింది. ఇది చెన్నై జట్టు చెత్త ప్రదర్శనగా నిలిచింది. ధోనీ సేన 2021లో మరోసారి పునరాగమనం చేసి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.

చెన్నై టీం ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది. CSK పేరిట అనేక పెద్ద రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200+ పరుగులు చేసిన జట్టుగా సీఎస్‌కే జట్టు నిలిచింది. CSK 28 సార్లు ఈ అద్భుతమైన ఫీట్ సాధించింది.

అత్యధిక ఫైనల్స్ ఆడిన జట్టుగా చెన్నై..

ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా 10 సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడింది. 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాల్లో CSK IPL టైటిల్‌ను గెలుచుకుంది. వరుసగా రెండేళ్లు టైటిల్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా CSK నిలిచింది. 2020లో CSK రికార్డును ముంబై ఇండియన్స్ సమం చేసింది.

2008లో తొలిసారిగా ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోని పేరు అగ్రస్థానంలో నిలిచింది. ఎంఎస్ ధోనీ తన ఫ్రాంచైజీ తరపున 226 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఈ కాలంలో ఎంఎస్ ధోని జట్టు 133 మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో CSK 91 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కొంది. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో జట్టు విజయాల శాతం 58.84గా ఉంది. 2 మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితం రాలేదు.

Tags:    

Similar News