Rajiv Khel Ratna Award: రోహిత్ శర్మ పేరును ఖేల్ రత్నకు సిఫార్సు చేసిన సెలక్షన్ కమిటీ
Rajiv Khel Ratna Award: టీంఇండియా ఓపెనర్ రోహిత్ శర్మకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ దక్కనుంది.
Rajiv Khel Ratna Award: టీంఇండియా ఓపెనర్ రోహిత్ శర్మకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ దక్కనుంది. ఈ పురస్కారాల కోసం క్రీడాకారులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించిన సెలక్షన్ కమిటీ రోహిత్ తో పాటు రెజ్లర్ వినేష్ ఫోగట్, టేబుల్ తెన్న్నిస్ ప్లేయర్ మణిక బాత్ర, పారా ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ఈ అవార్డ్లకు సిఫార్సు చేసింది. దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్న్నత పురస్కారం ఇదే..
గత ఏడాది క్రికెటర్ రోహిత్ శర్మ తన బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 2019 సీజన్‌లో రోహిత్ వన్డేల్లో 7 సెంచరీలు చేయగా, మొత్తం 1490 రన్స్ చేశాడు. ఒకవేళ రోహిత్‌కు ఖేల్ రత్న అవార్డ్ దక్కితే.. ఆ అవార్డు అందుకున్న నాల్గవ క్రికెటర్‌గా నిలుస్తాడు. భారత్ తరపున మూడు డబల్ సెంచెరీస్ చేసిన మొట్టమొదటి ఆటగాడు. రోహిత్ తరువాత సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ భారత్ తరపున డబల్ సెంచెరీస్చేసారు. అంతే కాదు, క్రికెట్ చేరిత్రలోనే మూడు డబల్ సెంచెరీస్ చేసిన ఆటగాడుగా రోహిత్ శర్మ రికార్డు సాదించాడు.
కాగా ఇండియన్ క్రికెట్‌లో రోహిత్ శర్మ కంటే ముందు ముగ్గురు మాత్రమే రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(1998), టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని(2007), ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(2018)లో ఎంపికయ్యారు.