Team India: ఆసియా కప్‌కు భారత్‌ దూరం.. టీమిండియా పాల్గొనబోదన్న బీసీసీఐ

Team India: తటస్థ వేదికపై ఆడేందుకు సిద్ధమని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడి

Update: 2022-10-18 16:00 GMT

Team India: ఆసియా కప్‌కు భారత్‌ దూరం.. టీమిండియా పాల్గొనబోదన్న బీసీసీఐ

Team India: వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనబోదంటూ బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. ముంబైలో నిర్వహించిన బీసీసీఐ 91వ వార్షిక సమావేశం అనంతరం జేషా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆసియా కప్‌ పాకిస్థాన్‌లో కాకుండా.. తటస్థ వేదికపై నిర్వహిస్తే భారత జట్టు ఆడుతోందని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్లదు.. పాక్‌ జట్టు భారత్‌కు రాదని తేల్చి చెప్పారు. గతంలోనూ ఆసియా కప్‌ తటస్థ వేదికలపై నిర్వహించినట్టు జై షా తెలిపారు.

భారత్‌ చివరిసారిగా 2006లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో 2023 నుంచి భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సీరీస్‌ ఆడలేదు. కేవలం ప్రపంచ స్థాయి టోర్నీల్లో మాత్రమే భారత్‌, పాక్‌ తలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. బీజీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో రోజర్‌ బిన్నీని బోర్డు నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. బిన్నీ ఒక్కరే ఈ పదవికి నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. జైషా కార్యదర్శిగా మరోసారి కొనసాగనున్నారు.  

Tags:    

Similar News