U-19 Asia Cup: 8వ సారి ఫైనల్ చేరిన భారత్.. శ్రీలంకతో తుది సమరం.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?
U-19 Asia Cup: అండర్-19 ఆసియాకప్ రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 103 పరుగుల తేడాతో విజయం సాధించింది.
India U19 Vs Bangladesh U19: అండర్-19 ఆసియాకప్ రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 103 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 90 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడిన షేక్ రషీద్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో, బంగ్లాదేశ్ కెప్టెన్ రకీబుల్ హసన్ ఖాతాలో 3 వికెట్లు చేరాయి.
బంగ్లాదేశ్ 244 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా, దానికి సమాధానంగా ఆ జట్టు 38.2 ఓవర్లలో 140 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత యువ బ్రిగేడ్ అండర్-19 ఆసియా కప్‌లో 8వ సారి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. టోర్నమెంట్ మొదటి సెమీ-ఫైనల్‌లో శ్రీలంక జట్టు పాకిస్తాన్ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. అనంతరం పాక్ జట్టు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.
8వ సారి ఫైనల్‌లో భారత్..
అద్భుత విజయం సాధించడంతో, అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా 8వ సారి ఫైనల్‌కు చేరుకుంది. విశేషమేమిటంటే భారత్ ఫైనల్ ఆడినప్పుడల్లా విజయం సాధించింది. అండర్-19 ఆసియా కప్‌ను టీమ్‌ఇండియా ఇప్పటి వరకు 6 సార్లు కైవసం చేసుకుంది. 2012లో భారత్, పాకిస్థాన్‌లను ఉమ్మడి విజేతలుగా నిలిచాయి.లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా టీం పేలవమైన ఆరంభాన్ని అందుకుంది.
జట్టు తన మొదటి 5 వికెట్లను కేవలం 59 పరుగులకే కోల్పోయింది. ఆ జట్టు తొలి వికెట్ తెహ్జీబుల్ ఇస్లామ్ రూపంలో పడింది. ఇస్లాం 3 పరుగుల వద్ద రవి కుమార్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. బంగ్లాదేశ్‌కు రెండో దెబ్బ రాజ్ బావా 26 పరుగుల వద్ద మహ్ఫిజుల్ ఇస్లాం చేతికి చిక్కాడు. ప్రతీక్ నవ్రోజ్‌కు ఎల్‌బీడబ్ల్యూ ద్వారా రవికుమార్ భారత్‌కు మూడో వికెట్‌ను అందించాడు. దీంతో బంగ్లా జట్లు ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ప్రతీక్ 12 పరుగులు చేశాడు. బన్ నాలుగో వికెట్ రాజ్‌బావా ఖాతాలో చేరింది. బావ ఐచ్ మొల్లను సున్నాపై పెవిలియన్ పంపాడు.
12వ ఓవర్లో రాజ్‌వర్ధన్ వేసిన బంతికి మహ్మద్ ఫాహిమ్ 5 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. రాజ్‌వర్ధన్ తన తర్వాతి ఓవర్‌లోనే ఎస్‌ఎం మహరోబ్ (7 పరుగులు)ను అవుట్ చేశాడు. బంగ్లాదేశ్ 7వ వికెట్‌గా ఆశికుర్ జమాన్ (15 పరుగులు), 8వ వికెట్‌గా నైమూర్ రోహ్‌మాన్ (6 పరుగులు) వెనుదిరిగారు. కెప్టెన్ రకీబుల్ హసన్ 16 పరుగులు చేయగా, అరిఫుల్ ఇస్లామ్ 42 పరుగులు చేశాడు.
రషీద్ మినహా అంతా విఫలం..
భారత ఇన్నింగ్స్‌లో, షేక్ రషీద్ 90 పరుగులు మినహా, జట్టులోని ఒక్క ఆటగాడు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కెప్టెన్ యశ్ ధుల్ 29 బంతుల్లో 26 పరుగులు చేశాడు. లీగ్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడిన రాజ్ బావా, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ అద్భుతంగా ఏమీ చూపించలేకపోయారు. బావా 40 బంతుల్లో 23 పరుగులు, రాజవర్ధన్ 7 బంతుల్లో 16 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌లో జట్టు తొలి వికెట్‌గా హర్నూర్ 29 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 2 ఫోర్లు వచ్చాయి. అతను ఔటైన తర్వాత, ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేక 16 పరుగులు చేసి ఔటయ్యాడు. జట్టుకు మూడో దెబ్బ నిశాంత్ సింధు రూపంలో పడింది. అతను 15 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు.
అద్భుత ఫామ్‌లో ఉన్న యంగిస్థాన్..
ప్రస్తుత టోర్నీలో భారత యువ ఆటగాళ్లు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. తొలి మ్యాచ్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏకపక్షంగా 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి 2 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ పరాజయం తర్వాత, జట్టు బలమైన పునరాగమనం చేసి 4 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. లీగ్ దశలో భారత జట్టు 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
రెండు జట్లు-
భారత్- హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షేక్ రషీద్, యశ్ ధుల్ (కెప్టెన్), నిషాంత్ సింధు, రాజ్ బావా, ఆరాధ్య యాదవ్ (కీపర్), కౌశల్ తాంబే, రాజవర్ధన్ హంగర్గేకర్, విక్కీ ఓస్త్వాల్, రవి కుమార్
బంగ్లాదేశ్- మహ్ఫిజుల్ ఇస్లాం, ఇఫ్తాఖేర్ హుస్సేన్ ఇఫ్తీ, ప్రాంతిక్ నవ్రోజ్ నబిల్, ఐచ్ మొల్లా, మహ్మద్ ఫహీమ్ (కీపర్), ఎస్ఎం మహరోబ్, రకీబుల్ హసన్ (కెప్టెన్), తంజీమ్ హసన్ సాకిబ్, అషికుర్ జమాన్, అరిఫుల్ ఇస్లాం, నైమూర్ రోహ్మాన్