Team India: అలా జరిగితే తప్ప సెమీఫైనల్ చేరలేని టీమిండియా

* న్యూజిలాండ్ - ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ పై ఆధారపడిన భారత జట్టు భవితవ్యం

Update: 2021-11-01 08:30 GMT
Team India have Less Chances to get Into the Semi Finals in T20 World Cup 2021

Team India: అలా జరిగితే తప్ప సెమీఫైనల్ చేరలేని టీమిండియా

  • whatsapp icon

Team India: భారత జట్టు సెమీస్ చేరాలంటే అద్భుతాలు జరగాల్సిందే.. టీమిండియా తన తదుపరి మ్యాచులు నవంబర్ 3న అఫ్గానిస్థాన్, నవంబర్ 5న స్కాట్లాండ్, నవంబర్ 8న నమీబియా‌లపై గెలవడమే కాకుండా రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా న్యూజిలాండ్ - అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై అఫ్గానిస్థాన్ ఘనవిజయం సాధించాలి. దాంతో న్యూజిలాండ్, భారత్, అఫ్గానిస్థాన్ 6 పాయింట్లతో సమానంగా ఉండి అందులోను టీమిండియా రన్‌రేట్ కూడా మెరుగ్గా ఉంటే సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరగడం దాదాపుగా కాని పనే అని అర్ధమవుతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా భారత్ సెమీస్ చేరదనేది మాత్రం వాస్తవం. అంతేకాకుండా టీమిండియా ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే నవంబర్ 3న అఫ్గానిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో ఓడినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతయినట్లే.

Tags:    

Similar News