మళ్లీ ఐపీఎల్ కాదు ప్రపంచకప్‌ కూడా ఆడతా!

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ పేరు చెబితే చాలు అతని దుందుడుకు స్వభావం అందరికీ గుర్తుకొస్తుంది.

Update: 2020-06-22 03:24 GMT
Sreesanth (File Photo)

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ పేరు చెబితే చాలు అతని దుందుడుకు స్వభావం అందరికీ గుర్తుకొస్తుంది. 2013 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతం కేసులో శిక్ష పడి తెరమరుగైపోయిన ఈ పేసర్‌ 7ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అతనిపై విధించిన నిషేధం పూర్తవనుంది. దీంతో తాను మళ్లీ భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తానని, ఐపీఎల్‌లోనూ ఆడతానని అంటున్నాడు. భారత జట్టు లోకి చోటు దక్కిచుకుంటానని, 2023 ప్రపంచకప్‌లో ఆడతాననే నమ్మకముందన్నడు. అంతేకాదు ఎక్కడైతే శిక్షకు గురయ్యానో అదే ఐపీఎల్‌ వేదికపై మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నా. ఫిట్‌నెస్‌ కోచ్‌ టిమ్‌ గ్రోవర్‌ నాకీ స్ఫూర్తి ఇచ్చాడు. పునరాగమనం కేవలం రంజీ మ్యాచ్‌లు, ఇరానీ ట్రోఫీ ఆడడం కోసం మాత్రం కాదు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలని అన్నాడు.

ఐపీఎల్ స్పాట్‌ ఫిక్సింగ్‌లో వేటు తర్వాత ప్రపంచం అంతా వేలెత్తి చూపించినట్లు అనిపించింది. మానసికంగా కుంగిపోయిన సమయంలో హర్భజన్‌సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌తో పాటు స్నేహితులు అండగా నిలిచారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా భయపడ్డా. ఎవరైనా కిడ్నాప్‌ చేస్తారేమోనన్న పిచ్చి భయాలు వెంటాడేవి. అమ్మానాన్నకు కూడా ముఖం చూపించలేక గదిలోనే ఏడుస్తూ ఉండేవాడిని. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే ముఖాన నవ్వుతూ వచ్చేవాడిని. ఎందుకంటే నా బలహీనతను తల్లితండ్రుల ముందు ప్రదర్శించాలనిపించేది కాదన్నడు. ఇప్పటికీ నా బౌలింగ్‌ యాక్షన్‌ మారలేదని చెప్పుకొచ్చారు.

నిషేదం తర్వాత అప్పులు కట్టడం కూడా కష్టమైంది. ఈ స్థితిలో సినిమాలు ఆదుకున్నాయి. అప్పులు తీర్చుకోవడానికి, కుటుంబాన్ని గడపడం కోసం సినిమాల్లో నటించాను నిషేధం తొలగబోతోంది. ఇక నా ధ్యాసంతా క్రికెట్ పైనే అని అన్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1 నుంచి 6 వరకు ఎర్నాకుళంలోని ఇండోర్‌ నెట్స్‌లో సాధన చేస్తున్నా. అండర్‌-23 ఆటగాళ్లతో పాటు సచిన్‌ బేబి లాంటి కేరళ రంజీ క్రీడాకారులు నాకు సాయం చేస్తున్నారని శ్రీశాంత్ చెప్పాడు. టీం ఇండియా తరపున శ్రీశాంత్ 27 టెస్టుల్లో 87 వికెట్లు పడొ ట్టడు. 53వన్డేల్లో 75 వికెట్లు తీసుకున్నాడు. 40 ipl మ్యాచుల్లో 44 వికెట్లు తీశాడు. భారత్ జట్టు తరపున చివరి వన్డే , టెస్ట్ మ్యాచులు 2011లో ఆడాడు. 

Tags:    

Similar News