సచిన్ , ద్రవిడ్ 40.. ధోనీ 38కేనా.. శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని భారత జట్టులోకి పునరాగమనంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Update: 2020-05-29 03:49 GMT
Sreesanth(file photo)

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని భారత జట్టులోకి పునరాగమనంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.టీమిండియాలో ధోనీ రిటర్న్స్ ఎప్పుడని క్రికెట్ అభిమానుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కూడా ఒకరు. ధోని ఇంకా ఫిట్ గా ఉన్నాడని, అతడు మరో అడుగు ముందుకేసి వచ్చే 3-4 ఏళ్ళు క్రికెట్ ఆడగలరని శ్రీశాంత్ అభిప్రాయపడ్డారు.

హలో యాప్‌తో.. సంభాషణలో శ్రీశాంత్ ధోని ఆకాశానికెత్తేశాడు.. పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు, "ధోనికి ఇంకా ఫిట్‌నెస్ ఉందని. గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తున్నాడని, ప్రస్తుతం రిషబ్ పంత్, సంజు సామ్సన్ అయితే ధోని తో సమానం అయితే కాదని శ్రీశాంత్ పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ తో మ్యాచ్ అంటే ధోని ఆస్వాదించేవాడని, సిక్సర్లు కొట్టేవాడు అని శ్రీశాంత్ అన్నారు. శ్రీశాంత్ మాట్లాడుతూ, "పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు ముందు ధోని తనను అడిగేవాడని... ఈ రోజు ఏ బౌలర్ సిక్సర్ కొట్టాలో చెప్పమనేవాడని అన్నాడు. మహమ్మద్ ఆసిఫ్ బౌలింగ్ లో బాదాలని తాను చెప్పినట్లు గుర్తచేశాడు. అన్నట్లుగానే ధోని చాలా లాంగ్ సిక్సర్ కొట్టాడు. ధోని మాటిచ్చి సిక్సర్లు కొట్టేవాడని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

ధోని భారత జట్టు బ్లూ జెర్సీని ధరించి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు, అతనికి ప్రాక్టీస్ అవసరం లేదని ప్రశంసించాడు. ధోనీ వయస్సు 38 సంవత్సరాలు అని ఆరోగ్యంగా ఉన్నాడు. సచిన్, ద్రవిడ్ 40 సంవత్సరాలు ఆడినప్పుడు ధోని కూడా ఆడవచ్చని శ్రీశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Tags:    

Similar News