Flight Accident in Kerala: 2020 దయచేసి కనికరించు.. కేరళ ఘటన పై భారత క్రికెటర్లు!
Flight Accident in Kerala: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా
Flight Accident in Kerala: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి విమానం పక్కకు జారింది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. అయితే ఆ ఘటన పైన పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే భారత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..
" ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" .. సచిన్ తెందూల్కర్..
" విమానం రెండు ముక్కలవ్వడం చూస్తుంటే భయమేసింది. అందరూ బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" ... గౌతమ్ గంభీర్
" కొలికోడ్‌లో చోటుచేసుకున్న ప్రమాదం గురించి తెలుసుకొని షాక్ కి గురయ్యా..ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను " రోహిత్ శర్మ
" కొలికోడ్ విమాన ప్రమాద మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. బాధితుల కోసం ప్రార్థిస్తున్నాను ".. కోహ్లి.
"కొలికోడ్‌లో చోటుచేసుకున్న ప్రమాదం నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది .. అందరి కోసం ప్రార్థిస్తున్నా. 2020 దయచేసి కనికరించు" యువరాజ్ సింగ్
ఇక ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్ తో సహా 20 మంది దుర్మరణం పాలైనట్లుగా సమాచారం.. దాదాపుగా 120 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో మొత్తం 191 మంది విమానంలో ఉన్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది. కేరళలో భారీ ఎత్తున వర్షం పడుతోంది. దీని వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.