Virat Kohli: మ్యాచ్ మొదలైనప్పటి నుండే ధైర్యంగా లేము.. ఆట ఇంకా మిగిలే ఉంది
* కివీస్ తో టీమిండియా ఓటమితో సెమీస్ ఆశలు గల్లంతు
Virat Kohli: పాకిస్తాన్ చేతిలో ఓటమి మరువకముందే టీమిండియా జట్టు మరోసారి కివీస్ తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్ లో ఘోర పరాజయం పాలయి సెమీస్ ఆశలను వదులుకుంది. తాజాగా కివీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ప్రదర్శనపై కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో విరాట్ కోహ్లి మాట్లాడుతూ ఇది టీమిండియా అత్యంత ఘోరమైన ప్రదర్శన అని తాము అటు బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమయ్యామన్నాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుండే మేం ధైర్యంగా లేము. మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు మా బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గాలేదు.
న్యూజిలాండ్ అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను మంచి ప్రదర్శన కనబరిచి అవకాశం దొరికిన ప్రతీసారి టీమిండియాని దెబ్బకొట్టింది. షాట్ ఆడాలా? వద్దా? అనే ఆలోచన ఫలితమే మా ఈ వైఫల్యమని విరాట్ చెప్పుకొచ్చాడు. టీమిండియా విజయాన్ని కోరుకునే అభిమానులు స్టేడియాలకు వస్తారు, టీవీల ముందు కూర్చుంటారు. ఆటలో ఒత్తిడి సహజమే ఇదేం భారత జట్టుకు కొత్తకాదని కాని జరిగిన రెండు మ్యాచ్ లలో ఒత్తిడిని జయించలేకే గెలవలేకపోయమని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.