T20 WC 2024 Super 8 Schedule: 8 జట్లు, 7 రోజులు, 12 హై ఓల్టేజ్ మ్యాచ్‌లు.. సూపర్ 8 పూర్తి షెడ్యూల్ ఇదే..!

T20 World Cup 2024 Super 8 Schedule: టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 దశలో ఎనిమిదో జట్టు కూడా నిర్ధారణయింది.

Update: 2024-06-17 04:58 GMT

T20 WC 2024 Super 8 Schedule: 8 జట్లు, 7 రోజులు, 12 హై ఓల్టేజ్ మ్యాచ్‌లు.. సూపర్ 8 పూర్తి షెడ్యూల్ ఇదే..!

T20 World Cup 2024 Super 8 Schedule: టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 దశలో ఎనిమిదో జట్టు కూడా నిర్ధారణయింది. ఏడు జట్లు ఇప్పటికే సూపర్ 8కి చేరుకున్నాయి. అయితే నేపాల్‌పై బంగ్లాదేశ్ విజయంతో గ్రూప్ డి నుంచి సూపర్ 8కి చేరిన రెండో జట్టుగా బంగ్లాదేశ్ టీం అవతరించింది. నేపాల్‌ను 21 పరుగుల తేడాతో ఓడించి సూపర్ 8 టిక్కెట్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 8 జట్ల మధ్య సెమీఫైనల్ పోరు ఏడు రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 19 నుంచి 25వ తేదీ వరకు ఏడు రోజుల్లో సూపర్ 8 దశలో 12 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ దశలోని అన్ని మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో జరుగుతాయి. మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికా, సహ-ఆతిథ్య అమెరికా మధ్య జరుగుతుంది. ఇది అమెరికాకు తొలి ప్రపంచ కప్. దాని మొట్టమొదటి ప్రపంచ కప్‌లో, ఈ జట్టు సూపర్ 8కి చేరుకోవడంలో విజయం సాధించింది. సూపర్ 8లోని ఎనిమిది జట్లను గ్రూప్ వన్, గ్రూప్ టూగా విభజించారు. అన్ని జట్లు ఒక్కొక్కటి మూడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. రెండు గ్రూపులలోని మొదటి రెండు జట్లు జూన్ 27న సెమీ-ఫైనల్‌లో తలపడనున్నాయి.

సూపర్ 8లో రెండు గ్రూపులు..

గ్రూప్ 1

భారతదేశం

ఆస్ట్రేలియా

ఆఫ్ఘనిస్తాన్

బంగ్లాదేశ్

గ్రూప్ 2

ఇంగ్లండ్

అమెరికా

దక్షిణ ఆఫ్రికా

వెస్టిండీస్

నాలుగు గ్రూపుల నుంచి సూపర్ 8కి చేరుకున్న జట్లు..

గ్రూప్ A: ఇండియా, అమెరికా

గ్రూప్-బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా

గ్రూప్ సి: ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్

గ్రూప్-డి: దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్

ఇది సూపర్ 8 పూర్తి షెడ్యూల్..

అమెరికా vs దక్షిణాఫ్రికా, 19 జూన్, యాంటీగా

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్, 20 జూన్, సెయింట్ లూసియా

భారతదేశం vs ఆఫ్ఘనిస్తాన్, 20 జూన్, బార్బడోస్

ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్, 21 జూన్, యాంటీగా

ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా, 21 జూన్, సెయింట్ లూసియా

అమెరికా vs వెస్టిండీస్, 22 జూన్, బార్బడోస్

భారత్ vs బంగ్లాదేశ్, 22 జూన్, యాంటీగా

ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, 23 జూన్, సెయింట్ విన్సెంట్

అమెరికా vs ఇంగ్లాండ్, 23 జూన్, బార్బడోస్

వెస్టిండీస్ vs సౌతాఫ్రికా, జూన్ 24, యాంటీగా

భారత్ vs ఆస్ట్రేలియా, జూన్ 24, సెయింట్ లూసియా

ఆఫ్ఘనిస్తాన్ vs బంగ్లాదేశ్, జూన్ 25, సెయింట్ విన్సెంట్

Tags:    

Similar News