T20 World Cup 2021 - Aus Vs Eng: హ్యాట్రిక్ కోసం ఆరాటం.. సెమీస్ కోసం పోరాటం

* ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య నేడు దుబాయ్ వేదికగా హోరాహోరి పోరు

Update: 2021-10-30 09:02 GMT

ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య నేడు హోరాహోరి పోరు

T20 World Cup 2021 - Australia Vs England: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా గ్రూప్ 1 లో నాలుగు పాయింట్లతో టాప్ లో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు(అక్టోబర్ 30) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా హోరాహోరి పోరు జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు రెండు విజయాలతో మంచి ఊపుమీద ఉండగా నేటి మ్యాచ్ తో హ్యాట్రిక్ విజయం సాధించి సెమీఫైనల్ కి చేరాలని తహతహలాడుతున్నాయి.

ఇంగ్లాండ్ జట్టులో జాసన్ రాయ్ అద్భుత బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించగా లివింగ్ స్టన్, మొయిన్ అలీ అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఆసీస్ జట్టు విషయానికొస్తే ఇటీవల జరిగిన మ్యాచ్ తో ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి ఫామ్ లోకి రాగా ఆరోన్ ఫించ్, స్మిత్ తమ బ్యాటింగ్ తో రాణిస్తున్నారు. బౌలింగ్ లో కమిన్స్, హజెల్ వుడ్, స్టార్క్ తమ పదునైన బౌలింగ్ తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్ మెన్ లను తక్కువ పరుగులకే కట్టడి చేస్తున్నారు.

దుబాయ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్టే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ వివరాలు:

ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా

అక్టోబర్ 30 (శనివారం) 2021

మధ్యాహ్నం 7.30 నిమిషాలు

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

హెడ్ టూ హెడ్

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు 19 టీ20 మ్యాచుల్లో తలపడగా అందులో 10 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 8 మ్యాచుల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి. ఒక్క మ్యాచులో మాత్రం ఫలితం తేలలేదు. టీ20 ప్రపంచకప్ లలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఒక్కో విజయం సాధించాయి.

ఇరు జట్ల తుది వివరాలు ఇలా ఉండే అవకాశాలున్నాయి

ఇంగ్లండ్ జట్టు:

జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్

ఆస్ట్రేలియా జట్టు:

డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Tags:    

Similar News