దేసయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తమిళనాడు జట్టు టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఆదివారం బరోడాపై జరిగిన ఫైనల్లో దినేష్ కార్తిక్ సారథ్యంలోని తమిళనాడు టీమ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తమిళనాడు జట్టు రెండోసారి ముస్తక్ అలీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సారి కీలక ఆటగాళ్లు లేకపోయినా దినేశ్ కార్తీక్ కుర్రాళ్లతోనే జట్టును ముందుకు నడిపి విజేతగా నిలబెట్టాడు. అలీ ట్రోఫీ ఆరంభ సీజన్ 2006-07లో టైటిల్ గెలిచిన తమిళనాడు.. మళ్లీ ఇప్పుడు 15ఏండ్ల తర్వాత ఆ టోర్నీ విజేతగా నిలిచింది.
టైటిల్ ఆనందంలో దినేశ్ కార్తీక్ అండ్ టీమ్ మునిగిపోయింది. తమిళ స్టార్ విజయ్ థళపతి సినిమాలో 'మాస్టర్'లోని ఓ పాటకు కార్తీక్‌తో పాటు జట్టు సభ్యులు డ్యాన్స్ చేశారు. తమిళంలో ఉన్న 'వాథీ కమింగ్' (మాస్టర్ వస్తున్నాడు) మ్యూజిక్కు అందరూ చిందేశారు. ముందుగా తమిళ జట్టు కెప్టెన్ కార్తీక్ స్టైలిష్ మూవ్‌తో డ్యాన్స్ స్టార్ట్ చేయగా.. మాస్టర్‌గా అతడిని అనుసరిస్తూ మిగత ఆటగాళ్లు స్టెప్పులేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.