Suresh Raina Retirement: ఇంటర్నేషనల్ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పిన సురేష్ రైనా

Suresh Raina Retirement: క్రికెట్ టీంఇండియా ఆట‌గాళ్లు వ‌రుస షాకులిచ్చారు.ముందుగా సోషల్ మీడియా వేదికగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు.

Update: 2020-08-15 16:07 GMT
Suresh Raina announces retirement

Suresh Raina Retirement: క్రికెట్ టీంఇండియా ఆట‌గాళ్లు వ‌రుస షాకులిచ్చారు.ముందుగా సోషల్ మీడియా వేదికగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ షాక్ నుంచి అభిమానులు తెరుకోక ముందే.. కేవ‌లం నిమిషాల వ్యవధిలో మరో సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. 2018లో వ‌రుస‌గా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో టీమిండియాలో రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగిన సురేశ్ రైనా.. విరాట్ కోహ్లీ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత జట్టుకి క్రమంగా దూరమైపోయాడు.

2005లో శ్రీలంకపై తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రైనా.. ఇప్ప‌టివ‌ర‌కూ 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడాడు. వన్డే మ్యాచ్ లో 5615 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా 36 అర్థసెంచరీలు ఉన్నాయి. అలాగే టెస్టు లో .. 18 మ్యాచులు ఆడిన రైనా.. ఒక సెంచరీ, ఏడు అర్థ సెంచరీలతో మొత్తం 768 పరుగులు చేశాడు. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పేరు పొందాడు. 2020 టీ20 వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీ 2022కి వాయిదాపడిపోయింది. దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తానని ఇటీవల ధీమా వ్యక్తం చేసిన రైనా.. తన కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అదే బాటలో పయనించాడు. ఈ సంద‌ర్బంలో ధోనీతో ఆడటం తనకెంతో సంతోషంగా ఉందని ఇన్స్‌టాగ్రామ్ వేదికగా చెప్పిన సురేష్ రైనా ధోనీ ప్రయాణంలో తాను కూడా తోడుగా ఉండదలచుకున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 

Tags:    

Similar News