IPL 2021 PBKS vs SRH: పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజయం; హాఫ్ సెంచరీతో ఆదుకున్న బెయిర్‌స్టో

IPL 2021 Punjab vs Hyderabad: ఎట్టకేలకు హైదరాబాద్ టీం తొలి విజయం నమోదు చేసింది.

Update: 2021-04-21 13:30 GMT

హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెయిర్‌స్టో, వార్నర్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021 Punjab vs Hyderabad: ఎట్టకేలకు హైదరాబాద్ టీం తొలి విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ తో చెపాక్‌ వేదికగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

121 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ టీం ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ జొన్ని బెయిర్‌స్టో లు ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించారు. ఇద్దరు కలిసి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ ను తమ వైపునకు తిప్పుకున్నారు. 10.1 ఓవర్లో అల్లెన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ కి క్యాచ్ ఇచ్చి వార్నర్(37 బంతులకు 37 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు.

అప్పటికే మ్యాచ్ హైదరాబాద్ వైపు మళ్లింది. ఇక వార్నర్ ఔటయ్యాక కేన్ విలియమన్స్ బ్యాటింగ్ కు వచ్చాడు. కేన్(19 బంతులకు 16 పరుగులు), బెయిర్‌స్టో(56 బంతులకు 63 పరుగులు, 3ఫోర్లు, 3 సిక్సులు) ఇద్దరు మరో వికెట్ పడకుండా ఎస్‌ఆర్‌హెచ్ టీంను విజయ తీరాలకు చేర్చారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ ఫేలవ ప్రదర్శన కనబరిచింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి పూర్తి ఓవర్లు ఆడకుండానే 120 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్‌ బ్యాటింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 22, షారుఖ్‌ ఖాన్‌ 22 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3, అభిషేక్‌ శర్మ 2, రషీద్‌ ఖాన్‌, భువీ, కౌల్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

Tags:    

Similar News