Lanka Premier League Postponed: లంక ప్రీమియర్ లీగ్ వాయిదా
Lanka Premier League Postponed: కరోనా ఎఫెక్ట్‌తో లంక ప్రీమియర్ లీగ్‌కి ఆదిలోనే ఊహించని దెబ్బ తగిలింది. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ తరహాలో శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)ని నిర్వహించాలని యోచించింది
Lanka Premier League Postponed: కరోనా ఎఫెక్ట్‌తో లంక ప్రీమియర్ లీగ్‌కి ఆదిలోనే ఊహించని దెబ్బ తగిలింది. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ తరహాలో శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)ని నిర్వహించాలని యోచించింది. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 20 వరకూ ఈ టోర్నీని నిర్వహించాలని షెడ్యూల్ ను తయారు చేసింది. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో .. ఎల్‌పీఎల్ కోసం శ్రీలంకకు వచ్చే ఆటగాళ్లు 14 రోజుల స్వీయ నిర్బంధానికి లోను కావాల్సిందేనని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంగళవారం నాడు సమావేశమై టోర్నమెంట్‌ను వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
టోర్నమెంట్ ప్రారంభమయ్యేందుకు 17 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) ఎల్‌పీఎల్‌ను వాయిదా వేయవలసి వచ్చింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్ల కోసం శ్రీలంక ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్కువ నిర్బంధ కాలానికి అనుమతిస్తుందని బోర్డు ఆశించింది. ఏది ఏమైనా.. యూఏఈ వేదికగా ఐపీఎల్ జరుగుతున్న సమయంలో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభించాలనుకోవడం పొరపాటని గుర్తించిన బోర్డు.. లీగ్‌ను నవంబర్‌కు వాయిదా వేసినట్లు సమాచారం.