భారత్ - శ్రీలంక సిరీస్ తో లంక క్రికెట్ బోర్డుకు ఆదాయం 107.7 కోట్లు

Update: 2021-08-12 12:00 GMT

శ్రీ లంక క్రికెట్ బోర్డు (ట్విట్టర్ ఫోటో)

Sri Lanka Cricket Board: ఇటీవల భారత్ - శ్రీలంక మధ్య జరిగిన వన్డే మరియు టీ20 సిరీస్ నిర్వహించడంతో అప్పటివరకు నష్టాల్లో ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు లాభాల బాట పట్టింది. మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్ లలో భాగంగా ఆ మ్యాచ్ లకు సంబంధించిన ప్రసార హక్కులు మరియు ప్రకటనల రూపంలో లంక క్రికెట్ బోర్డుకు 107.7 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. ఈ విషయాన్ని తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక అధికారిక ప్రకటన ద్వారా మీడియాకి తెలియజేసింది. భారత్ జరిగిన సిరీస్ నిర్వహణకి సహకరించిన భారత క్రికెట్ బోర్డుకు, భారత క్రికెట్ జట్టుకు మరియు కోచ్ రాహుల్ ద్రావిడ్ కి ప్రత్యేకంగా లంక బోర్డు ధన్యవాదములు తెలిపింది.

ఇక మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ 2-1 తేడాతో వన్డే సిరీస్ ని గెలుపొందగా, టీ20లో 2-1 తేడాతో లంక టీ20 సిరీస్ ను సాధించింది. గత రెండేళ్ల తరువాత ఇంత పెద్ద మొత్తం శ్రీలంక బోర్డుకు ఆదాయం రావడంతో అటు లంక బోర్డుతో పాటు ఆటగాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 3 నుండి దక్షిణాఫ్రికా జట్టుతో 3 టీ20 లు, 3 వన్డే సిరీస్ లో శ్రీలంక జట్టు స్వదేశంలో తలపడనుంది. ఇక లంక జట్టు పర్యటనలో ఉండగా భారత ఆటగాళ్ళు క్రునాల్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్పలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News