Inida Vs Sri Lanka T20: కొలంబో వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక అద్భుత విజయాన్ని సాధించింది. భారత్ పై నాలుగు వికెట్ల తేడాలో లంక గెలిచింది. దీంతో ఇరు జట్లు సిరీస్‌ను 1-1తో సమం చేశాయి. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లంక నాలుగు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. లంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు లంక బ్యాట్స్‌మెన్ చెమటోడ్చారు. శ్రీలంక బ్యాట్స్ మన్ భానుకా 35, ధనంజయ డిసిల్వా 40 పరుగులతో జట్టు విజయానికి తోడ్పాటు అందించారు. అటు భారత బౌలర్లలో కుల్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టగా రాహుల్, చాహార్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెన్లు ధావన్, గైక్వాడ్ శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే భారీ షాట్‌కు యత్నించి గైక్వాడ్ అవుట్ కావడంతో బరిలోకి దిగిన పడిక్కల్ కాసేపు మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. టీమ్ స్కోర్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో ధనంజయ 2 వికెట్లు తీశాడు. అనంతరం 133 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 12 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 11ను భువీ వెనక్కి పంపాడు. దాంతో శ్రీలంక కష్టాల్లో పడింది. ఆ తర్వాత మినోద్ భానుక, సమర విక్రమ స్థిరంగా ఆడి స్కోరును పరుగులు పెట్టించారు. చివరకు క్రీజులో ఉండి లంక విజయంలో ధనుంజయ కీలక పాత్ర పోషించాడు. చివరి మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. లంక విజయానికి ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా ధనుంజయ సునాయసంగా లంకను విజయతీరాలకు చేర్చాడు.