ధోనీని కూడా సచిన్‌లానే ఎత్తుకొని తిరగాలి : శ్రీశాంత్‌

2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. దీనితో భారత జట్టు రెండో సారి ప్రపంచకప్‌ ని సొంతం చేసుకుంది. అయితే ఆ ప్రపంచకప్ లో ధోని అండ్ టీం సీనియర్ ఆటగాడు సచిన్ ని భుజాలపై ఎత్తుకొని ఎలా తిరిగారో, అలాగే ధోనీని కూడా టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఎత్తుకొని తిరగాలని ఆశిస్తున్నట్టుగా భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. తాజాగా క్రికెట్‌ అడిక్టర్‌ అనే కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్ ఈ కామెంట్స్ చేశాడు.

Update: 2020-06-26 16:36 GMT

అయితే గతేడాది ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ కి దూరంగా ఉన్న ధోని మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా ఎదురూ చూస్తున్నాడు. ధోని ఎంట్రీ ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడడంతో ధోని భవితవ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధోనిని రిటైర్ అవ్వాలని కొందరూ కోరుతూ ఉండగా, మరికొందరు మాత్రం ధోని ఆడాలని కోరుకుంటున్నారు. అందులో శ్రీశాంత్ ఒకడు..

ధోని పొట్టి ప్రపంచ కప్ ఆడి తీరాలని గట్టిగా కోరుకుంటున్నట్టుగా శ్రీశాంత్ తెలిపాడు. ధోని రిటైర్మెంట్ పైన రకరకాల వార్తలు వస్తున్నాయని కానీ అవేమి ధోని పట్టించుకోవడం లేదని, దేశం కోసం ధోని ఎన్నో సేవలు చేస్తున్నాడని శ్రీశాంత్ తెలిపాడు. తానూ ఓ క్రికెట్‌ అభిమానిగా 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంకపై గెలిచాక సచిన్‌ను ఎలాగైతే భుజాలపై ఎత్తుకొని తీసుకువెళ్ళారో అలాగే ధోనీని కూడా టీ20 ప్రపంచకప్‌లో ఆడి గెలిచాక మైదానంలో ఆటగాళ్ల భుజాలపై తీసుకెళ్లడం తనకు చూడాలని ఉందని శ్రీశాంత్ వెల్లడించాడు.

ఇక ఇటు శ్రీశాంత్ విషయానికి వచ్చేసరికి 2013లో ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ కేసులో ఇరుకున్న శ్రీశాంత్‌ మళ్లీ జట్టులోకి రావాలని చూస్తున్నాడు. ఫిక్సింగ్‌ కేసులో బీసీసీఐ అతడిపైన జీవితకాలపు నిషేధం విధించింది. తాజాగా సుప్రీంకోర్టు ఆ కేసును పరిశీలించి నిషేధ కాలాన్ని తగ్గించాలని ఆదేశించడంతో బీసీసీఐ దానిని ఏడేళ్లకు పరిమితం చేసింది. ఆ గడువు ఈ సెప్టెంబర్ తో ముగుస్తుంది. మళ్ళీ శ్రీశాంత్ తన ఫామ్ ని నిరూపించుకుంటే జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది

Tags:    

Similar News