T20 Warm-up Match: పాక్ కి షాక్.. వార్మప్ మ్యాచ్ లో ఓటమి
* సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఓటమి పాలయిన పాకిస్తాన్
T20 Warm-up Match: మరో మూడు రోజుల్లో భారత్ - పాక్ మధ్య జరగబోయే మ్యాచ్ కు ముందే పాకిస్తాన్ టీంకి గట్టి షాక్ తగిలింది. గురువారం పాకిస్తాన్ - దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పరాజయం పాలవడంతో అటు ఆ జట్టు ఆటగాళ్ళతో పాటు పాక్ క్రీడాభిమానులు నిరాశ చెందారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 186/6 పరుగులు చేయగా చివరి బంతి వరకు రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు 190/4 పరుగులతో లక్ష్యాన్ని చేధించి ఘనవిజయం సాధించింది.
దక్షిణాఫ్రికా ఆటగాడు డుసేన్ 51 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ జట్టులో జమాన్ 51, ఆసిఫ్ అలీ 32 మినహా ఎవరు అంతగా రాణించలేకపోయారు. అంతకు ముందు అక్టోబర్ 24న జరగబోయే మ్యాచ్ లో భారత్ ని తప్పక ఓడిస్తామని చెప్పిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మాటలు వార్మప్ మ్యాచ్ తో తేలిపోయాయి. ఈ మ్యాచ్ ఓటమితో అటు సోషల్ మీడియాలో పాక్ జట్టుపై నెటిజన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.
భారీ స్కోర్ మ్యాచ్ ని కాపాడుకోలేకపోయాడని, బాబర్ తప్పుడు నిర్ణయాల వల్లే ఈ ఓటమి అని మరికొందరు ఇలా ఎవరికీ నచ్చినట్లు వారు పాక్ జట్టును ఆట ఆడుకుంటున్నారు. అక్టోబర్ 24న జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుందో.., ఎవరు విజయం సాధిస్తారోనని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.