SA vs SL: దక్షిణాఫ్రికాపై పోరాడి ఓడిన శ్రీలంక

SA vs SL: దక్షిణాఫ్రికా 5వికెట్లకు 428 పరుగులు

Update: 2023-10-08 02:03 GMT

SA vs SL: దక్షిణాఫ్రికాపై పోరాడి ఓడిన శ్రీలంక 

SA vs SL: ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు అదిరే ఆరంభం. ముగ్గురు బ్యాటర్లు శతకాలు బాదడంతో పరుగుల వరద పారించిన ఆ జట్టు శనివారం 102 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మార్‌క్రమ్‌ 106 , డికాక్‌ 100 , వాండర్‌డసెన్‌ 108 రెచ్చిపోవడంతో మొదట దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 428 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఆస్ట్రేలియా రికార్డును దక్షిణాఫ్రికా బద్దలు కొట్టింది.

ఛేదనలో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. కుశాల్‌ మెండిస్‌ 76 సంచలన ఇన్నింగ్స్‌తో ఆ జట్టుకు బలమైన పునాదే వేసినా.. అతను వెనుదిరిగాక లంక గాడి తప్పింది. తర్వాత అసలంక 79, శానక 68 పోరాడినా.. అప్పటికే ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది. కొయెట్జీ మూడు వికెట్లు పడగొట్టగా.. మహరాజ్‌, రబాడ, జాన్సన్‌ తలో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. మార్‌క్రమ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

Tags:    

Similar News