దాదా ఆరోగ్యంపై‌ తాజాగా హెల్త్‌ బులిటెన్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు వుడ్‌ల్యాండ్స్‌ హాస్పిటల్‌ తాజాగా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Update: 2021-01-03 12:03 GMT

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు వుడ్‌ల్యాండ్స్‌ హాస్పిటల్‌ తాజాగా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గంగూలీకి తదుపరి చికిత్స అంశంపై సోమవారం మెడికల్‌ బోర్డు సమావేశమవుతుందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గంగూలీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారని వివరించింది. గంగూలీ గుండెపోటుతో శనివారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

కోల్‌కతాలోని తన నివాసంలో ఈరోజు ఉదయం సౌరవ్ గంగూలీ వ్యాయమం చేస్తుండగా అస్వస్థతకి గురై కిందపడిపోయాడు. దాంతో కోల్‌కతాలోని ఉడ్‌లాండ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఎస్‌కేఎం కార్డియాలజిస్టు డాక్టర్‌ సరోజ్‌ మొండల్‌ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం సౌరవ్ కు కరోనరీ యాంజియోగ్రామ్‌ నిర్వహిస్తోంది. గుండె రక్తనాళాల్లో పూడికను పరిశీలించారు. అతడికి కుటుంబానికి గుండెజబ్బు చరిత్ర ఉందని ఆస్పత్రి తొలుత బులిటెన్‌ విడుదల చేసింది. గంగూలీ పూర్తిగా స్పృహలో ఉన్నాడని పేర్కొంది. గుండె రక్తనాళాల్లో రెండు చోట్ల పూడికలు ఉన్నాయని, వాటికి చికిత్స అందిస్తామని చెప్పింది.

గంగూలీకి గుండెపోటు వార్త తెలియడంతో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, దిగ్గజ క్రికెటర్ సచిన్, టీమిండియా కెప్టెన్ కోహ్లీ సహా అనేక మంది ప్రముఖులు గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News