SRH: సన్‌రైజర్స్ పులిబిడ్డకు బీసీసీఐ భారీ షాక్.. డబ్బుల్లెవ్, గిబ్బుల్లెవ్ అని తేల్చేసిన బోర్డు!
Sunrisers Hyderabad: ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ కఠినంగా వ్యవహరిస్తూ కాంట్రాక్ట్ అవకాశం ఇవ్వడం లేదు. శ్రేయస్ అయ్యర్ మాత్రం తిరిగి స్థానం సంపాదించనున్నాడు.

SRH: సన్‌రైజర్స్ పులిబిడ్డకు బీసీసీఐ భారీ షాక్.. డబ్బుల్లెవ్, గిబ్బుల్లెవ్ అని తేల్చేసిన బోర్డు!
Sunrisers Hyderabad: ఇషాన్ కిషన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. గతంలో బీసీసీఐతో తలెత్తిన వివాదాల తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించారు. అప్పటి నుంచి తిరిగి రాక కోసం తీవ్రంగా శ్రమించాడు. ఇండియా-A జట్టులో అవకాశం దక్కించుకున్న కిషన్, ఐపీఎల్ 2025లో ఒక శతకంతో దుమ్మురేపాడు. దీంతో మళ్లీ అతను కాంట్రాక్ట్‌కు వస్తాడనే అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ మాత్రం మరోసారి కిషన్‌ను కాంట్రాక్ట్ లిస్టులో చేర్చే ప్రసక్తే లేదని తేల్చేసిందట. వాస్తవానికి అతను కొన్ని విషయాలు మెరుగుపరుచుకున్నా, తగినంత ప్రదర్శన కనబరిచినట్టు బోర్డు భావించడం లేదని తెలుస్తోంది.
ఇతర ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మాత్రం ఈ విషయంలో ముందంజలో ఉన్నాడు. గతంలో అతనూ కాంట్రాక్ట్ నుంచి తప్పించబడ్డా, తర్వాత ముంబై తరఫున డొమెస్టిక్ టోర్నీలలో చక్కటి ప్రదర్శనలతో తిరిగి ఫోకస్‌లోకి వచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇరానీ కప్‌లలో అతని నాయకత్వం, ప్రదర్శన బీసీసీఐని ఆకట్టుకున్నాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు టాప్ స్కోరర్‌గా నిలిచిన అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ పునరుద్ధరణ ఖాయమైంది. ఇక కోహ్లీ, రోహిత్ శర్మల విషయానికొస్తే, టి20ల్లో అనిపించకపోయినా వారు సీనియర్ స్టార్స్ కావడం వల్ల వారి A+ గ్రేడ్ కాంట్రాక్ట్ కొనసాగించనున్నారు. బీసీసీఐ వారి ప్రాధాన్యతను బేరీజు వేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.