Gujarat Giants vs Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు రెండో విజయం

Gujarat Giants vs Mumbai Indians: గుజరాత్ జెయింట్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపు

Update: 2024-02-26 02:31 GMT

Gujarat Giants vs Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు రెండో విజయం 

Gujarat Giants vs Mumbai Indians: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. ఆదివారం గుజరాత్ జెయింట్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 127 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. మరో 11 బంతులు ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి 129 పరుగులతో విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్ సారధి హర్మన్ ప్రీత్ కౌర్ 46 పరుగులు నాటౌట్ గా నిలిస్తే, అమీలా కేర్ 31 పరుగులు, నాట్ స్కివర్ బ్రంట్ 22 పరుగులు చేశారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనుజా కన్వర్ రెండు, క్యాత్రిన్ బ్రైస్, లియా తాహుహు చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు నిర్దిష్ట 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.

Tags:    

Similar News