CSK vs RCB: సిక్సర్లతో చెలరేగిన జడేజా(62*); బెంగళూరు లక్ష్యం 192

IPL 2021 CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.

Update: 2021-04-25 12:01 GMT

IPL 2021 CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు లక్ష్యం ౧౯౨పరుగులుగా డిసైడ్ అయ్యింది. ఓపెనర్ డూప్లెసిస్ హాఫ్ సెంచరీతో మొదట విరుచుకపడగా, చివర్లో జడేజా(62 నాటౌట్) సిక్సర్లతో చెలరేగడంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది.  

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై టీం ఇన్నింగ్స్‌ను దూకుడిగా ఆరభించింది. చెన్నై ఓపెనర్స్ రుతిరాజ్, డుప్లెసిస్ మరోసారి మంచి ఆరంభాన్ని టీం కు అందించారు. పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. స్ట్రైకింగ్ రోటేట్ చేసుకుంటూ... బెంగళూరు బౌలర్లను ఇబ్బంది పెట్టారు.

అయితే, రుతురాజ్‌ గైక్వాడ్‌(33 పరుగులు, 25 బంతులు, 4ఫోర్లు, 1 సిక్స్) రూపంలో సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. చహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ తొలి బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన రుతురాజ్‌ జేమిసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

రుతిరాజ్ ఔటయ్యాక బ్యాటింగ్ వచ్చిన సురేష్ రైనా (24పరుగులు, 18 బంతులు, 1ఫోర్, 3 సిక్సులు) బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఆ వెంటనే 13.4 ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఈ మధ్యలో డుప్లెసిస్‌ హాఫ్ సెంచరీ (50 పరుగులు, 41 బంతులు, 5ఫోర్లు, 1 సిక్స్)) తో దూకుడి మీద ఉన్నాడు. రైనా అవుటైన ఓవర్లోనే హర్షల్ పటేల్ చేతిలో చిక్కి పెవిలియన్ చేరాడు.

వెంటవెంటనే రెండు వికెట్లో కోల్పోయినా బ్యాటింగ్ లో మాత్రం వెనక్కి తగ్గలేదు. అంబంటి రాయుడు, రవీంద్ర జడేజా ఫోర్లు బాదారు. ఇంతలో మరోసారి హర్షల్ పటేల్ తన మాయాజాలంలో అంబటి రాయుడి(14 పరుగులు, 7 బంతులు,1 ఫోర్, 1 సిక్స్) ని పెవిలియన్ చేర్చాడు.

ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన ధోనీ(2పరుగులు) తో కలిసి రవీంద్ర జడేజా (62 పరుగులు, 28బంతులు, ఫోర్లు, 5 సిక్సులు) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.

బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, చాహాల్ 1 వికెట్ పడగొట్టారు. మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదు.

Tags:    

Similar News