PBKS vs RCB: బెంగళూరు లక్ష్యం 180; కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్(91 నాటౌట్)
PBKS vs RCB: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ సూపర్ బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు సాధించింది.
PBKS vs RCB: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ సూపర్ బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు సాధించింది. దీంతో బెంగళూరు ముందు 180 పరుగులు టార్గెట్ ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ కింగ్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సింగ్ 7 పరుగుల వద్ద జమిసన్ బౌలింగ్‌లో కోహ్లీ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆ తరువాత గేల్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. చక్కని భాగస్వామ్యం ఏర్పరుస్తున్న వీరి జోడీని 10.4 ఓవర్లో డానియల్ సామ్స్ డైనమిక్ బ్యాట్స్‌మెన్ గేల్(46 పరుగులు, 24 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు)ను పెవిలియన్ చేర్చాడు. మరోవైపు రాహుల్ (91పరుగులు, 57 బంతులు, 7ఫోర్లు, 5సిక్సులు) మాత్రం పరుగుల వరద పారించి నాటౌట్ గా నిలిచాడు..
గేల్ తరువాత బ్యాటింగ్ వచ్చిన పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్ విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో జామిసన్ 2 వికెట్లు, శామ్స్, చాహల్, అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు7