Australia vs India: రోహిత్ శర్మ అసభ్యకర వ్యాఖ్యలు .. వీడియో వైరల్!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది.

Update: 2021-01-19 11:57 GMT

రోహిత్ శర్మ ఫైల్ ఫోటో

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ లో విజయం అందుకుంది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో ఛేదించింది. రిషభ్‌ పంత్‌ (89నాటౌట్‌; 138 బంతుల్లో 9x4, 1x6), వాషింగ్టన్‌ సుందర్‌(22) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు.

అయితే ఈ మ్యాచ్‌ విజయానందంలో ఉన్నహిట్ మ్యాన్ రోహిత్ శర్మ భూతు పురాణం అందుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంతకేం జరిగిందంటే.. భారత్ విజయానికి మూడు పరుగుల కావాల్సిన స్థితిలో జోష్ హజెల్ వుడ్ వేసిన లో ఫుల్ టాస్‌ను మిడాఫ్ మీదుగా ఫోర్ తరలించగా.. భారత శిభిరంలో ఆనందాలు రెకెత్తాయి. ఈ ఉద్విగ్న క్షణాన కెప్టెన్ రహానే, వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ ఆలింగనం చేసుకుంటూ సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఈ క్రమంలో రోహిత్ "Bhe**hod అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. ఇది టీవీ కెమెరాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక క్రికెట్‌లో ఆటగాళ్లు ఇలాంటి పదాలు ఉపయోగించడం సహజమే. రోహిత్ లాంటి సినీయర్ క్రికెటర్ ఇలా మాట్లాడడంపై పలువురు క్రికాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో రిషభ్‌ పంత్‌ (89నాటౌట్‌; 138 బంతుల్లో 9x4, 1x6), వాషింగ్టన్‌ సుందర్‌(22) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు.


Tags:    

Similar News