ధోని స్పెషల్ రికార్డుకు సౌతాఫ్రికాలో బీటలు.. భారత యువ కీపర్ బ్రేక్ చేసే ఛాన్స్..!

India vs South Africa: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఏ వికెట్ కీపర్‌ని ఎంచుకోవాలనేది టీమ్ ఇండియా ముందున్న అతిపెద్ద ప్రశ్న...

Update: 2021-12-24 16:30 GMT

ధోని స్పెషల్ రికార్డుకు సౌతాఫ్రికాలో బీటలు.. భారత యువ కీపర్ బ్రేక్ చేసే ఛాన్స్..!

India vs South Africa: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఏ వికెట్ కీపర్‌ని ఎంచుకోవాలనేది టీమ్ ఇండియా ముందున్న అతిపెద్ద ప్రశ్న. భారత్‌కు ఎంపికలు చాలానే ఉన్నాయి. వీరిలో వెటరన్ వృద్ధిమాన్ సాహా, యువ ఆటగాడు రిషబ్ పంత్‌తో సహా కొన్ని దేశవాళీ మ్యాచ్‌లలో ఆడుతున్న వికెట్ కీపర్లు ఉన్నారు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లో నైపుణ్యం ఉన్న ఆటగాడు భారత్‌కు అవసరం. ఇందులో సాహా తర్వాత రిషబ్ పంత్ బెస్ట్ ఆప్షన్‌గా పరిగణించారు. 

అయితే, అనేక ప్రశ్నలు కూడా తలెత్తాయి. కారణం పంత్ తప్పిదాలే. చాలా మ్యాచ్‌ల్లో తప్పులు చేశాడు. కానీ, విశేషమేమిటంటే అతను నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నాడు. దీంతో టీమిండియాలో స్థిరమైన కీపర్‌గా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో పంత్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటే ధోని పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.

నిజానికి టెస్టు మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 100 మంది ఆటగాళ్లను అవుట్ చేసిన రికార్డు భారత వికెట్ కీపర్‌గా ధోనీ పేరిట నమోదైంది. ధోనీ రికార్డును పంత్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ధోనీ 100 మంది ఆటగాళ్లను ఔట్ చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. వీటిలో వికెట్ కీపర్‌గా క్యాచ్‌లు, స్టంపింగ్‌లు ఉన్నాయి. ధోని తర్వాత వృద్ధిమాన్ సాహా రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఫీట్‌ను చేరుకోవడానికి సాహా 37 మ్యాచ్‌లు తీసుకున్నాడు. అదే సమయంలో కిరణ్ మోరే 39 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును చేరుకున్నాడు. కానీ, పంత్ ఇప్పటివరకు ఆడిన 25 టెస్టు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా 97 సార్లు ఆటగాళ్లను అవుట్ చేశాడు.

ఇప్పుడు రిషబ్ పంత్ స్టంప్స్ వెనుక నుంచి మరో 3వికెట్లను దక్కించుకుంటే అరుదైన రికార్డును నెలకొల్పునన్నాడు. ఈ మూడు వికెట్ల కోసం రెండు లేదా మూడు మ్యాచ్‌లు తీసుకున్నా, అతి తక్కువ మ్యాచుల్లో భారత వికెట్ కీపర్‌గా వేగంగా 100 మందిని పెవిలియన్ చేర్చిన రికార్డును నెలకొల్పనున్నాడు.

ఇప్పటి వరకు ఆడిన 25 టెస్టు మ్యాచ్‌ల్లో పంత్ 1549 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌ల్లో పంత్ అత్యుత్తమ స్కోరు 159 నాటౌట్‌గా నిలిచింది. 18 వన్డేల్లో 529 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. రిషబ్ తన కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌ను ఆగస్టు 2018లో ఇంగ్లాండ్‌తో ఆడాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు అతను సెప్టెంబర్ 2021లో ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

Tags:    

Similar News