బ్రెజిల్‌ ప్రపంచ కప్‌ సమరం అద్భుతంగా ఆరంభం.. డబుల్స్ గోల్స్‌తో సత్తా చాటిన రిచర్లిసన్

* 10 నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసిన రిచర్లిసన్.. సెర్బియాపై 2-0తో బ్రెజిల్‌ గ్రాండ్ విక్టరీ

Update: 2022-11-26 03:55 GMT

బ్రెజిల్‌ ప్రపంచ కప్‌ సమరం అద్భుతంగా ఆరంభం.. డబుల్స్ గోల్స్‌తో సత్తా చాటిన రిచర్లిసన్

Brazil Vs Serbia: ఫుట్ బాల్‌లో సైకిల్ కిక్ గోల్‌కు స్పెషాలిటీ ఉంది. అమాంతం గాల్లోకి ఎగిరి అలాంటి గోల్ కొట్టాలంటే టాలెంట్‌తోపాటు టైమింగ్ కూడా కుదరాలి. ఈతరం ఆటగాళ్లలో పోర్చుగల్ సూపర్ స్టార్ రొనాల్డో ఇలాంటి గోల్స్ కొట్టడంలో దిట్ట అయితే ఇప్పుడు బ్రెజిల్ యంగ్ సెన్సేషన్ రిచర్లిసన్ రొనాల్డోని మరిపించాడు అచ్చం రొనాల్డో మాదిరిగానే సైకిల్ కిక్‌తో గోల్ కొట్టి ఫిఫా వరల్డ్ కప్‌లో నయా స్టార్ అయిపోయాడు పది నిమిషాల వ్యవధిలో రిచర్లిసన్ రెండు ఖతర్నాక్ గోల్స్‌తో తన తడాఖా చూపెట్టడంతో ఫిఫా వరల్డ్ కప్‌ను బ్రెజిల్ ఘనవిజయంతో షురూ చేసింది.

గ్రూప్ - జి లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతొ సెర్పియాను ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో ఫస్టాఫ్‌లో ఇరు జట్లూ గోల్స్ ఖాతాను తెరవలేకపోయాయి. అయితే సెకండాఫ్‌ మొదలయిన వెంటనే బ్రెజిల్ దూకుడు చూపెట్టింది. ఈ క్రమంలో వినిసియస్‌ నుంచి వచ్చిన క్రాస్‌ పాస్‌ను ఎడమ కాలితో తన నియంత్రణలోకి తెచ్చుకున్న రిచర్లిసన్‌ ఒక్కసారి పైకి ఎగిరి 'సైకిల్‌ కిక్‌'తో కుడి కాలితో గోల్‌ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో వరల్డ్‌ నెం.1 బ్రెజిల్‌ జట్టు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఏకంగా 22 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసిందంటే బ్రెజిల్‌ ఏ స్థాయిలో ఆడిందో అర్థమవుతుంది.

Tags:    

Similar News