Dhoni: తలా ఫ్యాన్స్ మీకు గుడ్ న్యూస్.. ధోనీ రిటైర్మెంట్ ఇప్పట్లో లేదు..
Dhoni: ఐపీఎల్ 16 సీజన్ లో ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా..
Dhoni: ఐపీఎల్ 16 సీజన్ లో ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా.. ధోనీ ధోనీ అంటూ మైదానం మారుమోగింది. దీనికి కారణం మిస్టర్ కూల్ కు ఉన్న అశేష అభిమానగణమే..ఇందులో సందేహమే లేదు. కట్ చేస్తే ధోనీ రిటైర్మెంట్ పైనే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. రిటైర్మెంట్ విషయంలో తమ అభిమాన క్రికెటర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని ఫ్యాన్స్ తో పాటు క్రికెటర్లు సైతం చాలా టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఐపీఎల్ 16 ధోనీకి చివరిదని అందరికీ సందేహంగా మారింది. ఎందుకంటే, కోల్ కతా, చెన్నై మ్యాచ్ అనంతరం ప్లేయర్లంతా మైదానంలో తిరిగారు. అంతేకాదు, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం తన షర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. దీనికితోడు వచ్చే ఐపీఎల్ లో ధోనీ ఆడడు అంటూ కైఫ్ సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం లాంఛనమే అని దిగ్గజ క్రికెటర్లతో సహా పలువురు తేల్చేశారు. అయితే తన రిటైర్మెంట్ గురించి కెప్టెన్ కూల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్ తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం ధోనీ తన రిటైర్మెంట్ పై స్పందించాడు. రిటైర్మెంట్ గురించి ఇప్పుడే చెప్పలేనని..డిసెంబర్ లో మళ్లీ మినీ వేలం ఉంటుంది కాబట్టి..ఆ తలనొప్పిని ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, సీఎస్ కే కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కూడా చెప్పాడు.
ధోనీ మాటలు చూస్తుంటే..రిటైర్మెంట్ పై పునరాలోచనలో పడ్డాడని అనిపిస్తోంది. మరోవైపు ధోనీ రిటైర్మెంట్ పై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ గతంలోనే భిన్నంగా స్పందించారు. ధోనీ వచ్చే సీజన్ లో కూడా ఆడతాడని..అందుకు అభిమానులు ఎల్లవేళలా అతడికి సపోర్ట్ చేయాలని కోరారు. మొత్తంగా, ధోనీ చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే..రిటైర్మెంట్ నిర్ణయం ఇప్పట్లో ఉండదనేని సుస్పష్టంగా తెలుస్తోంది.