Vinesh Phogat Disqualified: వినేశ్ ఫోగాట్ అనర్హత వేటు వెనుక ఉన్న కారణాలు ఇవే..? అసలు ఏం జరిగిందంటే..?
Vinesh Phogat Disqualified: ప్రముఖ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ (Vinesh Phogat) 50 కేజీల విభాగం రెజ్లింగ్ ఫైనల్ పోటీకి ముందు ఆమెపై అనర్హత వేటు పడింది.
Vinesh Phogat Disqualified: మహిళా రెజ్లింగ్ విభాగంలో ఈ సారి గ్యారెంటీగా పసిడి పతకం వస్తుందన్న ఆశలపై ఒలంపిక్ కమిటీ నీళ్లు చల్లింది. ప్రముఖ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ 50 కేజీల విభాగం రెజ్లింగ్ ఫైనల్ పోటీకి ముందు ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో యావత్ దేశం ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయింది. ఇప్పటికే సెమీఫైనల్ లో గెలిచి పతకం ఖాయం చేసుకున్న వినేష్ ఫైనల్ పోటీలో కూడా విజయం సాధించి, పసిడి పతకంతో దేశం పేరును అగ్రస్థానంలో నిలబెడుతుందని అంతా భావించారు. కానీ ఒలంపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు.
ఇక అసలు విషయానికి వస్తే ఈ అనర్హత వేటు వెనక కారణాలను చూస్తే, వినేష్ ఫొగట్ 50 కేజీల విభాగం రెజ్లింగ్ ఫైనల్ పోటీకి ముందు ఆమె బరువు విషయంలో వచ్చిన తేడా వల్లనే ఒలంపిక్ సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఫైనల్ పోటీకి ముందు వినేష్ ఫొగట్ బరువు కొలతలను తీసుకోగా ఆమె 50 కేజీల విభాగంలో తన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఈ పోటీల నుంచి ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తూ ఒలంపిక్ సంఘం నిర్ణయం తీసుకుంది. కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉందనే సాకుతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అన్యాయమని అటు క్రీడాభిమానులు నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై భారత ఒలంపిక్ అసోసియేషన్ కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే సెమీఫైనల్ పోరులో తలబడిన వినేష్ ఫొగట్ బరువు విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని ప్రకటించారు. కానీ ఒక్క రోజు తేడాలోనే ఆమె బరువు ఎలా పెరిగిందంటూ వేటు వేయడం పై ఐఓఏ పలు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. మంగళవారం రాత్రి ఆమె ప్రపంచ నెంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఆమె ఫైనల్ చేరుకున్నారు.
అయితే ఒలంపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. కచ్చితంగా పతకం వస్తుందన్న క్రీడాకారిణి ఈ విధంగా అనర్హత వేటుకు గురవడంతో ఒక్కసారిగా క్రీడాభిమానులంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే ఒలంపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై పునః సమీక్ష జరిపిరాల్సిందేనని ఐఓఏ పట్టుబడుతోంది. ఒకవేళ ఒలంపిక్ అసోసియేషన్ పునః సమీక్ష జరిపి వినేష్ పొగాట్ పై అనర్హత వేటు తొలగించినట్లయితే, ఆమె మళ్ళీ ఫైనల్ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందని క్రీడానిపుణులు పేర్కొంటున్నారు.